Kamareddy I కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి ఘనంగా సన్మానం

మండల అధ్యక్షులుగా రెండవ సారి నియామకం

Kamareddy I కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి ఘనంగా సన్మానం

జయభేరి, కామారెడ్డి జిల్లా బ్యూరో :

రాజంపేట మండల అధ్యక్షులుగా రెండవసారి సావుసాని యాదవరెడ్డి ని రాష్ట్ర అధిష్టానం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఎర్ర ప్రణీత్ రెడ్డిని మండల అద్యక్షులు గా ఎన్నుకోవడం అవాస్తవమని,మండల కాంగ్రెస్ నాయకులు ఖండించారు.రాజంపేట మండల అధ్యక్షులుగా యాదవ రెడ్డి సమక్షంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రాజంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన సావుసాని యాదవ రెడ్డి ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్,జిల్లా అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు.మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆర్గొండ గ్రామానికి చెందిన ఎర్ర ప్రవీణ్ రెడ్డి లను నియమించారు.మండల యువజన అధ్యక్షులుగా అంకం కృష్ణారావు,సల్మాన్ లను నియమించినట్లు వారు పత్రికా ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సరియైన అవగాహన లేకపోవడం వలన  సమాచారం ఇవ్వడంలో ఆలస్యం జరిగిందని కాంగ్రెస్ పార్టీలో అందరం కలిసికట్టుగా పనిచేసి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని వారన్నారు.

Read More పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలి

రాజంపేట మండలం రెండు నియోజక వర్గాల పరిధిలో ఉండడంతో సమాచార లోపం ఇబ్బందుల్లో వుందని, త్వరలోనే వాటిని సరి చేసుకుంటామని నూతన అధ్యక్షులు సావుసాని యాదవ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘం భవనంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షులకు రాజంపేట గ్రామ అధ్యక్షులు బెస్త చంద్రం,మ్యాకల నర్సింలు శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ తనకు రెండవసారి మండల అధ్యక్షునిగా అధికారం కట్టబెట్టినందుకు రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, మండల నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్ షెట్కార్ ను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీరన్న పటేల్, యువజన నాయకులు అంకం కృష్ణారావు,కిసాన్ సెల్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు బెస్త చంద్రం, మేకల నరసింహులు, తోడంగల సత్యనారాయణ, భాగయ్య, భీమయ్య, మైనార్టీ అధ్యక్షులు షాదుల్లా, షాదుల్, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More ములుగు జిల్లా చల్పాక ఎన్ కౌంటర్ పై హైకోర్టులో నేడు విచారణ!

Latest News

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 

Social Links

Post Comment