Mallareddy college I మల్లారెడ్డి యూనివర్సిటీ లో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్
ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ ప్రారంభించిన మల్లారెడ్డి... విదేశీ విద్యపై విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన అలెగ్జాండర్
జయభేరి, మేడ్చల్ :
విద్యార్థులకు విదేశీ ఉద్యోగ అవకాశాలు:- మల్లారెడ్డి
మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మన తెలుగు పిల్లలు అమెరికాలో చాలా మంది ఉన్నారు. మన పిల్లలకు ఉన్న తెలివి, స్మార్ట్ నెస్ ప్రపంచంలో ఎవరికి ఉండదు. ప్రపంచంలో టాప్ సైంటిస్టలు కాని, టాప్ డాక్టర్స్ కాని, ఏ రంగంలో చూసుకున్న మన తెలుగువాళ్లే ఉన్నారు. అందుకే అప్లికేషన్ నుంచి, మంచి యూనివర్శిటి ఎంపిక విధానం వరకు అన్ని సక్రమంగా ఉండాలని, ఎంతో మంది మన పిల్లలు విదేశాల్లో చదివి, గొప్పగొప్ప వాళ్లు కావాలని ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ పెట్టడం జరిగింది. 26, 30 దేశాలలోని వారు ఏ యూనివర్శిటికి పోయినా మల్లారెడ్డి యూనివర్శిటి అందుకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తోందని నేను మాట ఇస్తున్నాను అన్నారు. మల్లారెడ్డి కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు డిగ్రీ తో పాటు ఉద్యోగ అవకాశాల కల్పనకు ఎడ్యుకేషన్ సెంటర్ ఉపయోగ ఎంతో పడుతుందన్నారు. విద్యార్థులు సమయాన్ని,డబ్బులు వృధా చేయకుండా కష్టపడి చదువుకొని తమ లక్ష్యాలను ఛేదించాలని సూచించారు. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రపంచ స్థాయిలో ఉండే అన్ని సదుపాయాలను మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్నామని ఈ జీవితం విద్యార్థుల అంకితం చేస్తున్నానని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.
విదేశీ చదువుల కోసం సులభతరం:- శ్రీకర్ అలపాటి
విదేశాలలో చదువుకొనే విద్యార్థులు ఎక్కడికెక్కడికో వెళ్లకుండా అన్ని సేవలు గ్లోబల్ ఎడ్యుకేషన్ నుంచి మల్లారెడ్డి యూనివర్శిటీలో అందించడం జరుగుతోందాని శ్రీకర్ ఆలపాటి అన్నారు. ఆఫర్ లెటర్, స్కాలర్ షిప్, వీసా గురించి అందించనున్నామని ఆయన తెలిపారు. విద్యార్థి ప్రొపెల్ బట్టి స్కాలర్ షిప్ కూడా ఇస్తారు. ఫారిన్ వెళ్లే విద్యార్థులకు ఏలాంటి అంక్షలు లేకుండా 60లక్షల వరకు మేము ప్రోవైడ్ చేస్తామని, విద్యార్థులకు సంబంధించిన అన్ని అనుమానాలను నివృత్తి చేసుకొవచ్చన్నారు. బుధవారం, గురువారం మల్లారెడ్డి యూనివర్శిటీలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఉంటుందాని దీనిని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీకర్ పేర్కొన్నారు.
Post Comment