ఆది దేవుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
సీఎస్కే విల్లా గణేష్ మండలిలో ఎమ్మెల్యే పూజలు
సీఎస్కే విల్లాస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
జయభేరి, షాద్నగర్ : సృష్టి లయకారుడు, ఆదిపరాశక్తిల ముద్దుబిడ్డ ఆది దేవుడి ఆశీస్సులు ప్రజలు అందరిపై ఉండాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆకాంక్షించారు. పట్టణంలోని సీఎస్కే గ్రీన్ విల్లాస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మహిళా నాయకురాలు రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ ప్రత్యేక పూజలను నిర్వహించారు.
నియోజకవర్గ అభివృద్ధితో పాటు తమ కాలనీ అభివృద్ధి కోసం కూడా ప్రత్యేక నిధులు కేటాయించి తమకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే శంకర్ ను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, కొంకల్ల చెన్నయ్య, వన్నాడ ప్రకాష్ గౌడ్, బాలరాజ్ గౌడ్, కౌన్సిలర్ సర్వర్ పాషా తలుపులు పాల్గొన్నారు.
Post Comment