Media I అమ్ముడుపోతున్న అక్షరం విలువలు కోల్పోతున్న జర్నలిజం...

జర్నలిస్టుల ముసుగుతో మేము విలేకరులమంటూ ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 200 మంది ఫేక్ జర్నలిస్టులు తయారై ఒక కమిటీగా ఏర్పడి రాజకీయ నాయకుల దగ్గర కాసులు దండుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి

Media I అమ్ముడుపోతున్న అక్షరం  విలువలు కోల్పోతున్న జర్నలిజం...

జయభేరి, హైద‌రాబాద్ : విలువలు కోల్పోతున్న జర్నలిజం రాను రాను అక్షరం అమ్ముడు పోతుంది.. రాత గాడి కైనా పాటగాడైనా అమ్ముడు పోవాల్సిందే అన్నట్టుగా మరో చరిత్రకు శ్రీకారం చుడుతుంది ఈ ప్రభుత్వం. ఇక జర్నలిస్టుల ముసుగుతో మేము విలేకరులమంటూ ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 200 మంది ఫేక్ జర్నలిస్టులు తయారై ఒక కమిటీగా ఏర్పడి రాజకీయ నాయకుల దగ్గర కాసులు దండుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.. 200, 300 వాళ్ళ ఛానల్ కు సబ్స్క్రయిబర్స్ ఉన్న వాళ్లు మాది ఒక పెద్ద ఛానల్ అంటూ లోగో పట్టుకొని సెల్ ఫోన్తో వీడియోలు తీస్తూ అప్లోడ్ చేసే వారిని సోషల్ మీడియా వారియర్స్ గా తమను తామే పేర్కొంటూ పబ్బం గడుపుకుంటున్నారు.. అదేదో ఛానల్ కు నేనే చైర్మన్ అదేదో పేపర్ కి నేనే బాస్ ను అన్నట్టుగా జీవితాన్ని కొనసాగించుకుంటున్న ఓ సదరు ఫేక్ జర్నలిస్టులు మీకే మిమ్మల్ని సంధించే ఈ కథనం ఒకసారి ఆలోచించండి...

అక్షరం విజ్ఞానాన్ని బోధించాలి జర్నలిజం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల్ని జాగ్రత్తపరిచి చైతన్యవంతుల్ని చేయాలి.. కానీ 500 రూపాయలు ఇస్తే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ నాయకుడికి భజన పడే జర్నలిజం అది ఒక జర్నలిజమా!?

Read More రామకోటి రామరాజు చిత్రకళ అమోఘం 

ఒక్క మీడియా సమావేశం ఉంది అంటే డబ్బులకు ఎగబడే రిపోర్టర్ల తీరు చూస్తే వారి జీవన పరిస్థితికి అర్థం పడుతుంది... చిల్లర కోసం ఫేక్ రిపోర్టర్లు మొత్తం జర్నలిజం సమాజాన్ని ప్రశ్నింపజేసేలా చేస్తుంది.. ఆర్ ఎన్ ఐ నెంబర్ లేని ఎన్నో ఆన్లైన్ పేపర్స్ పుట్టగొడుగుల పుట్టుకొచ్చి ఏదైనా దండాలు కొనసాగిస్తున్నారు.. వితౌట్ పర్మిషన్ తో కన్స్ట్రక్షన్స్ చేసే వారిపై తమ ప్రతాపాన్ని చూపిస్తూ మునిసిపల్ లో అధికారులను మచ్చిక చేసుకుని రిపోర్టర్ల ముసుగులో ఒక ఐడి కార్డును తయారు చేసుకుని వాటిని ఆధారంగా చేసుకొని వేలకు లక్షలకు పైగా డబ్బులు గుంజుతున్న నకిలీ రిపోర్టర్లను చూసి ఏమనుకోవాలి!? ఎలా వారి గురించి చెప్పాలి..!?

Read More ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 

జర్నలిజం అంటే అన్ని విషయాల్లోనూ సమ భావన సమాలోచన కలిగి ఉండాలి. కానీ అదే పనిగా పరిమిషన్ లేని కన్స్ట్రక్షన్ పడుతూ రోజుకు ఎంత దండుకున్నామో అని ఆలోచనలతో ముందుకు పోతున్న రిజిస్టర్ లేని పేపర్ జర్నలిస్టులారా ఒక్కసారి సిగ్గు పడండి... మనది ఒక బతుకేనా సందులలో పందుల వలె వీధులలో కుక్కల వలె అన్న శ్రీ శ్రీ మాటలు ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోండి.. ఒకనాడు బతకనీకి బడిపంతులు ఉద్యోగం అన్నట్టు ఈనాడు బతకాలంటే జర్నలిస్టు ముసుగులో దంతాలు కొనసాగించవచ్చు అన్న ఆలోచన జర్నలిజాన్ని పెడదోవ పట్టిస్తోంది.. అక్షరం అమ్ముడు పోతుంది జర్నలిజం విలువలు కోల్పోతుంది... సిగ్గులేని సమాజాన్ని అగ్గి తోటి కడిగేయాలని సినీ కవి అన్నట్టుగా సిగ్గులేని ఈ జర్నలిస్టులను ఏం చేయాలో మీరే ఆలోచించండి... ఇక పెద్ద పేపర్లో అంటూ ముందుకు వచ్చి అందిన అవకాశాలను అదే అదనుగా వెనుకేసుకుంటూ వస్తున్న సదరు పెద్ద పత్రికల విలేకరులను సవినయంతో ప్రశ్నిస్తున్న...

Read More ప్రజా సంక్షేమమే కాంగ్రేస్ ప్రభుత్వ లక్ష్యం...  ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి

Journalists3

Read More ఘనంగా మాజీ ఎమ్మెల్యే శ్రీ రామావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ పుట్టినరోజు వేడుకలు

ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్న తరవాత కూడా మళ్లీ మళ్లీ తామే కరువు బాధితుల్లా ఎగబడే ఓ నా జర్నలిస్టు మిత్రులారా మీ తోటి వారికి కూడా అందించే ప్రయత్నాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు!? అందుకే కాబోలు చిన్న చిన్న పత్రికలు ఏర్పాటు చేసుకొని వాటికి రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోయినా నడిపించుకుంటూ కాలాన్ని నెట్టుకొస్తుంటే అది వాలి జీవన పరిస్థితిని అర్థం చేసుకొని వదిలేద్దామా లేదంటే సమాజాన్ని జర్నలిజాన్ని జర్నలిజం యొక్క విలువలని పెడదోవ పట్టిస్తున్న వీళ్లను పోలీసులకు పట్టిద్దామా అన్న ఆలోచనను మీరే నిర్ణయించుకోవాలి.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో జర్నలిస్టుల జేఏసీల పేరుతో మూకుమ్మడిగా వసూళ్లకు దిగిన జర్నలిస్టులను చూస్తే ఎందుకోసమా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది అని అనిపించేలా ఉంటుంది... పైసలు ఇవ్వకుంటే ఒకలాగా రాస్తారు పైసలు ఇస్తే మరొక లాగా రాస్తే ఈ పరిస్థితిని ఎవరు ఆపాలి... నిజమైన జర్నలిజానికి కాలం చెల్లిపోయిందా అంటే అవుననే సమాధానం గట్టిగా వినిపిస్తోంది...

Read More రైతుబంధును బంజేసే కుట్ర: హరీశ్ రావు..!!

రాష్ట్ర రాజకీయాల్లోనూ రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్లే ఎక్కువగా వారి ఆస్తులను అక్రమార్దనను అవినీతి కరెన్సీ కట్టలు పోగును కాపాడుకునేందుకే  రాజకీయాల్లోకి వస్తుంటే... అదే కొవ్వలు బెదిరించి బతకడానికే అన్నట్టుగా జర్నలిజం లో మేము రిపోర్టర్లమే అంటూ గన్ మైకు పట్టుకుని ఓ ఆన్లైన్ పేపరు రిజిస్టర్ కానిది వాటిని పట్టుకొని వసూళ్లకు దిగే వారిని చూస్తే నిజమైన నికార్సైన జర్నలిస్టులకు సిగ్గు వేస్తోంది... అందుకే ఓ సీనియర్ జర్నలిస్టు పెద్ద పేపర్ల హవా పడిపోయింది సోషల్ మీడియాలో వచ్చే పేపర్ల హవా అదేనండి సోషల్ మీడియా అవా పెరిగిపోయింది అంటూ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు... అంటే ప్రింట్ మీడియాలో ముద్రణ అయ్యే పెద్ద పేపర్ల విషయంలో ఈరోజు ఈ విషయం రాస్తే రేపు మరుసటి రోజు ఆ వార్త పేపర్ లో వస్తుంది.. కానీ అదే సోషల్ మీడియాలో అయితే వెంటనే అది వార్త కానీ కథనం కానీ వెంటనే రావడం వల్ల ఒకింత రిజిస్టర్ లేని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి అవకాశం గా మారుతుంది...

Read More ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికే పెద్ద పీఠ 

రిజిస్టర్ లేనటువంటి ఆయా పత్రిక న్యూస్ ఛానల్ లను వెంటనే ప్రజలు గుర్తించి వీరి ఆగడాలను అరికట్టాలి... లేదంటే అవినీతి అక్రమాలు భూకబ్జాలు నేరాలు చేసిన వారికి వత్తాసు పలుకుతూ ఇలాంటి వారు రాసే రాతలు జనాలను ఏ వైపు దృష్టి సారిస్తారు... చెడ్డవానినైనా మంచివానిగా చిత్రీకరించే ఆయా ఛానల్ లను ఎవరు నియంత్రణ చేయాలి!? పత్రికా స్వేచ్ఛానికి భంగం కలిగించే ఇలాంటి రిజిస్టర్ లేనటువంటి అర్హత లేనటువంటి పత్రికలను అరికట్టకపోతే రాబోయే రోజుల్లో ప్రతివారు నేను జర్నలిస్టుని నేను రిపోర్టర్ ని అని చెప్పుకొని రౌడీయిజానికి పాల్పడిన ఆశ్చర్యపోనక్కర్లేదు... నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు చేతులెత్తి మొక్కిన రుణం తీరదు... కానీ జర్నలిస్టు ముసుగులో వసూళ్ల దందాలకు దిగుతున్న వారిని అరికట్టకపోతే ఆ ప్రభావం సమాజం మీద పడి ప్రజాస్వామ్య మనుగడకు చెంపపెట్టుగా మారుతుంది.. విషయ పరిజ్ఞానం ఉండదు ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించడానికి వీలువదు కనీసం జర్నలిజం అంటే అర్థం తెలియని వారు సైతం రిపోర్టర్న అంటూ ఏదో ఒక ఫేక్ కార్డును మెడలో వేసుకొని చిన్నచిన్న సాధ వ్యాపారం చేసుకునే వారిని కూడా వదలకుండా వసూళ్లకు దిగే వారిని కఠినంగా శిక్షించాల్సిందే...రాజకీయ నాయకులు సమాజాన్ని ఎంత ప్రభావితం చేస్తారో అలాగే రిజిస్టర్ లేని ఆయా పేపర్ ఎలక్ట్రానిక్ మీడియాల ప్రభావం కూడా అంతే స్పీడుగా చెడు ప్రభావాన్ని సమాజంలో పుట్టిస్తుంది... బతకడానికి ఏదైనా పని చేసుకొని బతకవచ్చు అంతేకానీ వసూళ్ల కోసమే దందాలు చేసుకుంటూ అక్రమ కట్టడాలపై నిగా పెట్టి అదే తడవుగా వసూలు చేస్తున్న ఆయా రిజిస్టర్ లేని పత్రిక ఛానల్ వారికి కాస్త అవగతం అయ్యేలా ఈ కథనం...

Read More మహారాష్ట్రలో పనిచేయని ఆరు గ్యారంటీలు

సమాజాన్ని బాగు చేయనక్కరలేదు కనీసం పాడు చేయకుండా ఉంటే చాలు అది రాజకీయ నాయకుడైన జర్నలిస్టులైనా సరే ఎవరైనా సరే... అంతేకానీ అనుభవం ఉండదు ఆ ఛానల్, ఆ పేపర్ కి రిజిస్ట్రేషన్ ఉండదు లైసెన్స్ కావు అలాంటి వాటిలో పని చేస్తూ మేము రిపోర్టర్ల మీ అంటూ సమాజం మీద పడి దోచుకుంటున్న వాళ్లు రిపోర్టర్ల !? దొంగల!? వీళ్ళని ఏం పేరుతో పిలవాలి!

Read More మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయం పట్ల హర్షం  

మారుతున్న కాలంతో పాటు మారుతున్న సమాజానికి అక్షరం ఆయుష్షును పోయాలి అంతేకానీ జర్నలిజం అంటే చీదరించుకునే లాగా చేసే ఈ సమాజంలో ఇలాంటి దొంగ రిపోర్టర్లకు వెంటనే బుద్ధి చెప్పకపోతే సమాజం పూర్తిగా మలినం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి... అసలే 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఇలాంటి రిజిస్టర్ లేని అనుభవం లేని రిపోర్టర్లు ఎక్కువగా తయారయ్యారు ప్రతి నియోజకవర్గంలోనూ వీళ్లదే హవా కొనసాగుతోంది... ఎంతసేపు రాజకీయ నాయకుల వైఫల్యాలను ఆయా పార్టీల తప్పిదాలను మాట్లాడడమే కాదు... మనలోనూ ఉన్న చీడపురుగులను తీసేయాలని ఉద్దేశంతో ఈ కథనాన్ని అందిస్తున్నాను... ఎందుకంటే మన కంట్లో నలుసు పెట్టుకొని వేరేవానిని ఎత్తి చూపడం ఎంతవరకు సమంజసం... అందుకే మన తప్పును ముందు ఒప్పుకుంటూ మనలో ఉన్న ఫేక్ రిపోర్టర్లను ఏరిపారేస్తూ వాస్తవానికి ప్రాణం పోస్తూ నిజం మాట్లాడుకుందాం వాస్తవాన్ని అక్షరంగా మారుద్దాం... 

Read More మెడిసిటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

...- కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్
సీనియర్ జర్నలిస్ట్

Read More తూoకుంటలో బండి పద్మ మొదటి వర్ధంతి కార్యక్రమం 

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు