Medigadda I మేడిగడ్డ.. బొందల గడ్డ... భాష మార్చుకోకపోతే ప్రజలు చీదరిస్తారు!

గతంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్ అన్న మాటలను వల్లిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం... ఇంతకీ ప్రతిపక్షంలో కూర్చున్న కేసీఆర్ అనుచర గణం ప్రజలకు ఏ ఉద్దేశాన్ని నూరిపోయడానికి శ్రీకారం చుడుతోంది...

Medigadda I మేడిగడ్డ.. బొందల గడ్డ... భాష మార్చుకోకపోతే ప్రజలు చీదరిస్తారు!

జయభేరి, హైదరాబాద్ :

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ప్రతిపక్ష పార్టీలో కూర్చున్న టిఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ పర్యటనకు శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దానికి గట్టి కౌంటర్లు ఇస్తోంది. ఏం పీకనికి పోతావు అంటూ మేము అంటున్నది కాదు గతంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్ అన్న మాటలను వల్లిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం... ఇంతకీ ప్రతిపక్షంలో కూర్చున్న కేసీఆర్ అనుచర గణం ప్రజలకు ఏ ఉద్దేశాన్ని నూరిపోయడానికి శ్రీకారం చుడుతోంది... ఇదే విషయంపై 'జయభేరి' అందిస్తున్న కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ రాజకీయ సమగ్ర విశ్లేషణ...

Read More సైదాపూర్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్గా దొంత సుధాకర్

గతంలో కేసీఆర్ ఓడిపోయిన తర్వాత నల్లగొండ సభలో ఘాటు ఘాటు పదాలతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నూటికి ఏది వస్తే అది మాట్లాడుతూ మేడిగడ్డ... బొందల గడ్డ అని సంబోధించిన ఆ మాటలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తిరిగి వర్ణిస్తోంది... ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ సభలో తన హిస్టారీతిగా మాట్లాడిన మాటలను ఇంకా ఆహంకారం దొరపెత్తనం పోలేదు అన్న వాదనని కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది..

Read More తూoకుంటలో బండి పద్మ మొదటి వర్ధంతి కార్యక్రమం 

మేడిగడ్డకు ఎందుకు పోతున్నారు ఏం పీకానికి పోతున్నారు అనే మాటలను తిరిగి కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ నువ్వేం పీకానికి నల్గొండకు పోయినావు అనే మాటలను కూడా గట్టిగా కౌంటరు ఇస్తోంది... నిజానికి కెసిఆర్ ని కావాలనే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెడితే కనీసం ప్రజలపై మమకారం ప్రేమ ప్రజలకు సేవ చేసే ఒక నాయకుడిగా ఇంకా కేసీఆర్ మాట్లాడకపోవడం చాలా విచారకరం.. నిజానికి కేటీఆర్ రాజకీయ జీవితం చిన్నది అయినా సీఎం రేవంత్ రెడ్డి పై విరుచుకు పడడం రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు... కేటీఆర్ చేయాల్సిన పని ముందు మీ బావ హరీష్ రావును అడిగి నేర్చుకో ముందు మీ అయ్య మాటలను సరి చేయడం నేర్చుకో నీకు రాజకీయం తెలియకపోతే మీ బావ హరీష్ రావు దగ్గర రాజకీయం నేర్చుకో అంటూ గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి...
నిజానికి కేటీఆర్ కి రాజకీయ అనుభవం అంతగా లేకపోయినా మాటలు మాంత్రికుడిగా తండ్రి వారసత్వాన్ని పునికిపించుకొని అనతి కాలంలోనే ప్రజాదరణను పొందుకున్నాడు... ఐటి మినిస్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న అంతే అవినీతి ఆరోపణలను గట్టిగానే మూట కట్టుకున్నారు... కల్వకుంట్ల కుటుంబంలో కవిత కేటీఆర్ అల్లుడు హరీష్ రావు అందరికీ పెద్దదిక్కుగా కెసిఆర్ ముందుండి కథను నడిపించి తెలంగాణ సంపదను కొల్లగొట్టారని ఆరోపణలతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మూడు నెల క్రితమే తీర్పించి ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు...

Read More తెలంగాణ భవన్లో ఘనంగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు

ఆ అక్కస్ ను ఆ ఓటమిని  మింగుడు పడలేక
నల్గొండ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టుకి తెరాస నేతలు పయనమై వెళ్లడం కాంగ్రెస్ పార్టీ గట్టిగా కౌంటర్లు ఇస్తుంది.. ఎట్లు చూసినా గత పది సంవత్సరాలుగా ప్రభుత్వంలో తెరాస పార్టీ చేసిన వ్యవస్థీకృత అపరాధ భావమే ఇప్పుడు అవినీతి అక్రమాలు ఆరోపణలతో ఆ పార్టీని కుదిపేస్తున్న ఇంకోవైపు జన ఘర్షణకు పిలుపునిస్తూ పోరాటానికి మరో తెర లేపుతామంటూ తెరాస నాయకులు చేస్తున్న ఆరాటం అంతా కాదు...

Read More పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలి

ప్రతిపక్షంలో కూర్చున్న తెరాస పార్టీ నాయకులు అధినేత నిండు శాసనసభలో కేసీఆర్ రాకపోవడం ఆ పార్టీ నేతలు అరకురగా మాట్లాడుతుండడం ప్రతి విషయాన్ని దాటవేస్తూ గత కాంగ్రెస్ ప్రభుత్వ చరిత్ర పునాదులను వక్రీకరిస్తూ నిండు శాసనసభలో 10 ఏళ్ల అవినీతి ఆక్రమాలు వాటి గురించి నీ మాట్లాడకపోవడం జనాలందరూ ఇప్పటికే చూసి అసహ్యించుకుంటున్న అవేవీ పట్టనట్టు తెరాస నాయకులు ఏదో ఒక ఉద్యమానికి చేరలేపుతున్నారు... తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెరాస పార్టీ అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన ఐదు సంవత్సరాల తరువాత ఉద్యమాలు ఎందుకు అంటూ ఇందిర పార్కు దగ్గర స్థలాన్ని ఖాళీ చేయించిన ఘనత కేసిఆర్ కు చెందిన దే కదా!?

Read More ప్రజా పాలనపై కళాయాత్ర ప్రదర్శనలు

అనేక ఉద్యోగ సంఘాలు కుల సంఘాలను తిట్టి మరి పంపించిన దాఖలాలు కేసీఆర్ అప్పుడే మరిచిపోయాడా... పది సంవత్సరాలుగా కేసీఆర్ పాలనను ఎంతమంది ఆరోపణలు చేసిన అవినీతి అక్రమాలు చేసిన పదేళ్ల వరకు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చి కెసిఆర్ ను పెద్దదిక్కుగా భావించి తెలంగాణకు న్యాయం చేయమని కట్టబెడితే తెలంగాణ సంపదను ఆంధ్రావాళ్లు కొల్లగొట్టిన దానికంటే అయినోడు ఇంటివాడే సంపదను కొల్లగొట్టి సహజ సంపదలను పూర్తిగా అవినీతిమయం చేస్తూ కూడబెట్టిన సొమ్ము దేనికి ఉపయోగపడుతుందో తెలియక ఎడాపెడ ఎన్నికల్లో ఖర్చుపెట్టిన ఓటమినే చవిచూసిన కేసిఆర్ కి ఇప్పుడు కొత్తగా చలో మేడిగడ్డ అనే ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కేటీఆర్ కు అంతగా తెలియకపోవచ్చునా... అంటూ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.

Read More ముడుచింతలపల్లిలో గురువారం సాయిల్ హెల్త్ డే

ఒక్కసారి కేటీఆర్ తన తండ్రి మాటలను నెమరు వేసుకుంటూ ఇప్పుడు ఆయన తండ్రి వారసత్వాన్ని పునికపుచ్చుకునే విధంగా మేడిగడ్డకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మేడిగడ్డలో ఏం జరగబోతోంది ప్రభుత్వం ఏం అక్రమాలను బయట పెట్టబోతోంది అనే విషయాన్ని పక్కదారి మళ్లించేందుకే తెరాస నాయకులు చేస్తున్న ఆర్భాటమంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు గట్టిగా కౌంటర్లు ఇస్తున్న తెరాస నాయకులకు ఎందుకు కనువిప్పు కలగడం లేదన్నది తెలంగాణ ప్రజల ఆరోపణ...

Read More మహారాష్ట్రలో పనిచేయని ఆరు గ్యారంటీలు

ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయిన తరువాత ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ యాసను భాషను ముందు పెట్టి రాష్ట్రం సాధించుకున్న కేసీఆర్ నాయకుడే మళ్ళీ తెలంగాణ భాషను వక్రస్తూ డిక్షనరీలో లేని మాటలను తిడుతూ సన్నాసి దున్నపోతు వెధవ ఏం పీకుతారో పీక్కోండి అనే మాటలను ఆయన స్థాయికి అనే మాటలు కావు.. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ భాష సంస్కృతి సాంప్రదాయాలను గత పదివేల కేసీఆర్ పాలనలో పూర్తిగా బ్రష్టు పట్టింపచేసిన ఘనత కూడా కేసీఆర్కే చెందుతుంది... మొత్తానికి మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలన కోసం వెళుతున్న ప్రభుత్వానికి తెరాస నాయకులు చలో మేడిగడ్డ ఇస్తున్న పిలుపుకు ఎటు పొంతన లేకుండా రాజకీయ దుమారం రేగుతోంది... చూద్దాం రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ మాటలను నమ్మి పార్లమెంటులో తెరాస నాయకులకు అధికారం కట్టబెడతారా లేదంటే రాష్ట్రంలో విజయాన్ని అందించిన కాంగ్రెస్ పార్టీని తిరిగి పార్లమెంటులో కూర్చోబెట్టుకుంటారా అది తెలంగాణ ప్రజల ఆలోచనలకే వదిలేయాలి.. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రదీప్ ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రజా అభిప్రాయానికి గౌరవం ఉంటుంది కాబట్టి ప్రజలే నిర్ణయితలు కాబట్టి వారి విజ్ఞతకే వదిలేయాలి.... చలో మేడిగడ్డ తెరాస నాయకుల గౌరవాన్ని కాపాడుతుందా లేదంటే ఉన్న ఇజ్జత్ పోగొట్టుకుంటుందా అనేది కాలమే నిర్ణయించాలి...

Read More శ్రీ విష్ణు శివాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు

... కడారి శ్రీనివాస్ 
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత

Read More క్రియాశీల సభ్యత్వం పొందిన దయాకర్ రెడ్డి 

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు