అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన

గీత కార్మికులను ఇబ్బందులు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి - సాయిలు గౌడ్

అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన

జయభేరి, సెప్టెంబర్ 16:- కల్లుగీత కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గీత పనివారల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిజి సాయిలుగౌడ్ డిమాండ్ చేశారు.

సోమవారం మూడుచింతలపల్లి మండలం అద్రాస్ పల్లిలోని సర్వే నెంబర్  172, 173/1 భూముల్లో నాటిన ఈత వనాలను గీత పనివారల సంఘం నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని కొంతమంది వ్యక్తులు ఈ భూమిపై కన్నేశారని, ఈ భూమిపై హక్కు మాకే ఉంటుందని గీత కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు . అద్రాస్ పల్లిలోని 172, 173/1  సర్వేనెంబర్లపై ప్రభుత్వం సర్వే చేయించి గీత కార్మికులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

Read More  చిరంజీవి ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలు విరాళం

IMG-20240916-WA2846

Read More భవిష్యత్ లో క్రీడల విశ్వవేదికగా తెలంగాణ

గత మూడు సంవత్సరాలుగా ఈ భూమిలో బోర్లు వేసి డ్రిప్ ఇరిగేషన్ ద్వార నీటిని సరఫరా చేస్తు చెట్లను పెంచుతున్నట్లు, అయితే అందులో పదిహేను తాటి చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు ద్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విదంగా 560 జీవో ప్రకారం ఈతవనాల పెంపకానికి 10 ఎకరాలు భూమిని కేటాయించాలని రాష్ట్ర సంఘం తరపున ఎన్నో మార్లు  రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులకు జిల్లా కలెక్టర్ కు వినతులు చేశామని  విన్నవించమన్నారు.

Read More దేవరకొండ  లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు 20 దుప్పట్లు పంపిణీ 

అద్రాస్ పల్లిలో ప్రభుత్వ భూమి 20 ఎకరాలు ఉంటుందని అందులోనే గీత కార్మికులు ఎక్సైజ్ అధికారుల ఆదేశాల మేరకు చెట్ల పెంపకం చేస్తున్నుట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో ఆర్డినేటింగ్ జనరల్ సెక్రటరి నాగభూషణం, గీత పనివారల సంఘం ప్రధాన కార్యదర్శి యాదయ్యగౌడ్, జిల్లా కార్యదర్శి డిజి నరేంద్రప్రసాద్, గ్రామ అధ్యక్షుడు నాగేష్ గౌడ్, వీరస్వామిగౌడ్, వెంకటేష్ గౌడ్, భాస్కర్  తదితరులు పాల్గొన్నారు.

Read More బోడుప్పల్ లో అక్రమ నిర్మాణాల జోరు...

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన