సినిమా సెట్టింగ్స్ తో రామోజీ ఫిలిం సిటీ

సినిమా సెట్టింగ్స్ తో రామోజీ ఫిలిం సిటీ

జయభేరి, హైదరాబాద్, జూన్ 7 :
అక్షర యోధుడు రామోజీ రావు అస్తమించారు. ఆరోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్నఆయన ఇవాళ (జూన్ 8) తెల్లవారుజామున కన్నుమూశారు. రామోజీరావు అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ ఉన్నత స్థాయిని అధిరోహించారు. సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఎన్నో అద్భుత చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన, సినిమా షూటింగుల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని వసతులు ఒకేచోట ఉండాలని భావించారు. అనుకున్నట్లుగానే ఆయన కలలుగన్న ఫాంటసీ ప్రపంచం రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన ఈ ఫిల్మ్ సిటీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.హైదరాబాద్ నడిబొడ్డు నుంచి దాదాపు 35 కి.మీ దూరంలో ఉన్నది రామోజీ ఫిల్మ్ సిటీ. ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ స్టూడియోగా గుర్తింపు తెచ్చుకుంది RFC. హైదరాబాద్ శివారు ప్రాంతంలో విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని 2 వేల ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ స్టూడియో నిర్మాణానికి ఏకంగా 6 సంవత్సరాలు పట్టింది.

Read More యువత ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చాక కాకుండా ముందు నుండే సిద్ధంగా ఉండాలి...

హాలీవుడ్‌లోని యూనివర్సల్ స్టూడియోస్‌కు దీటుగా ఈ స్టూడియోను నిర్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ స్టూడియో మాత్రమే కాకుండా.. ప్రముఖ పర్యాటక ప్రదేశంగా, పలు ప్రత్యేక ఈవెంట్‌లకు వేదికగా, వినోద కేంద్రంగా విరాజిల్లుతోంది.రామోజీ ఫిల్మ్ సిటీలో ఏడాదికి 400 సినిమాలకు పైగా షూటింగులు జరుపుకుంటున్నాయి. ఇందులో తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు నిర్మించబడుతున్నాయి. ఒకే రోజులో ఏకకాలంలో 15 షూట్లు నిర్వహించే సత్తా RFCకి ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఫిల్మ్ మేకర్స్ కు ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ గా కొనసాగుతోంది.

Read More క్రియాశీల సభ్యత్వం పొందిన దయాకర్ రెడ్డి 

షూటింగ్, ఫిల్మ్ మేకింగ్ పరికరాలు మొదలుకొని విస్తృతమైన సెట్, పచ్చని ప్రకృతి దృశ్యాలు, అడవులు, సెట్టింగ్ వేదికలు, విమానాశ్రయం, రైల్వే స్టేషన్ లాంటి సెట్లతో పాటు సులభంగా అందుబాటులో ఉండే టెక్నాలజీ, వాటిని ఉపయోగించే టెక్నికల్ మ్యాన్ పవర్ అన్నీ ఇక్కడ ఉన్నాయి.ఫిల్మ్ మేకర్ కేవలం స్క్రిప్ట్, నటీనటులతో ఇక్కడికి వస్తే చాలు.. సినిమాను పూర్తి చేసుకుని బయటకు వెళ్లే అన్ని వనరులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్, పోస్ట్-ప్రొడక్షన్, వసతి, రెస్టారెంట్లు, లాజిస్టిక్స్ అన్నీ ఉంటాయి. వినోద ప్రాంతంగానూ కొనసాగుతోంది. ‘బాహుబలి’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలు ఎన్నో ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. ఈ సినిమాలోని పెద్ద పెద్ద భవంతుల సెట్టింగ్స్ అన్నీ ఇందులోనే ఏర్పాటు చేశారు. కాలకేయ సైన్యంతో యుద్ధం లాంటి అతిపెద్ద యాక్షన్ సన్నివేశాలు కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూట్ చేశారు. ఇప్పటికీ ‘బాహుబలి’ సినిమా సెట్టింగ్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో అలాగే ఉన్నాయి.

Read More ములుగు జిల్లా చల్పాక ఎన్ కౌంటర్ పై హైకోర్టులో నేడు విచారణ!

ఇక్కడ సినిమాలు తీయడం వల్ల మిగతా స్టూడియోలతో పోల్చేతే తక్కువ ఖర్చుతో పూర్తవుతుందంటారు మేకర్స్రామోజీ ఫిల్మ్ సిటీని చూడ్డానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులు తరలివస్తున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకుల RFCని సందర్శిస్తున్నారు. ఫిల్మ్ సిటీలో కాలిడోస్కోప్‌, రోలింగ్ ల్యాండ్‌స్కేప్‌లు, అద్భుతమైన గార్డెన్‌లు, ఆకర్షణీయమైన లైవ్ స్టంట్ షోలు, థ్రిల్ రైడ్‌లు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి.

Read More యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు

ఇక్కడి అద్భుతమైన సెట్‌లు సందర్శకులను ఆహ్లాదపరుస్తాయి. మొఘల్, మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన రాజభవనాల నుంచి అమెరికన్ వైల్డ్ వెస్ట్‌ లోని పట్టణాల వరకు అద్భుతమైన సెట్టింగ్స్ ఇందులో ఉన్నాయి. బోరాసుర, మాంత్రికుల గుహ, హవా మహల్, భయపెట్టే గుహలు పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంటాయి. రామోజీ టవర్ ఫిల్మ్ సిటీకే ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం ఫిల్మ్ సిటీకి సంబంధించిన ఏరియల్ వ్యూను అందిస్తుంది. 4D వర్చువల్ రియాలిటీని పొందే అవకాశం ఉంటుంది. మొత్తంగా ప్రపంచ ప్రఖ్యాత ఫిల్మ్ స్టూడియోను నిర్మించిన రామోజీరావు కన్నుమూయడం నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి తీరనిలోటు.

Read More నేత్రపర్వం నాచగిరి క్షేత్రం...

Latest News

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి