రూ.32,237 కోట్లతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ...

హైదరాబాదులో కొత్తగా ఏర్పాటయ్యే ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు... 6 కారిడార్లలో 116.2 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు... ఒకటిన్నర కిలోమీటరు దూరం భూగర్భంలో ప్రయాణించనున్న మెట్రో 

రూ.32,237 కోట్లతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ...

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులను రూ.32,237 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. రెండో దశలో... కొత్తగా ఏర్పాటవుతున్న ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు పరుగులు తీయనుంది.

మొదటి దశలో మూడు కారిడార్లలో మెట్రో రైలు 69 కిలోమీటర్ల మేర పరుగులు తీస్తోంది. రెండో దశలో మరో 6 కారిడార్లలో 116.2 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు విస్తరిస్తారు. రెండో దశ పూర్తయితే మొత్తం 9 కారిడార్లలో 185 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైలు పరుగులు తీయనుంది. 

Read More వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మొద్దునిద్ర వీడని రేవంత్ సర్కార్ 

రెండో దశలో ఎయిర్ పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రో రైలు వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆరాంఘర్-బెంగళూరు రహదారిపై కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్ పోర్టుకు మెట్రో రైలు మార్గం ఏర్పాటు చేయనున్నారు. 

Read More మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు

కారిడార్-4లో నాగోల్ నుంచి శంషాబాద్ వరకు 36.6 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గానికి ప్రభుత్వ ఆమోదం లభించింది. ఎయిర్ పోర్టు కారిడార్ లో సుమారు ఒకటిన్నర కిలోమీటరు దూరం భూగర్భంలో మెట్రో రైలు ప్రయాణించనుంది. ఫోర్త్ సిటీకి రూ.8 వేల కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలును తీసుకురానున్నారు. మెట్రో రెండో దశ డీపీఆర్ లను త్వరలోనే కేంద్రం అనుమతి కోసం పంపనున్నారు.

Read More ఘనంగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే ,బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు