ధ్యానం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి

  • కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సదుపాయాలు కల్పించాలి
  • ఘట్ కేసర్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

ధ్యానం కొనుగోలు ప్రక్రియను  వేగవంతం చేయండి

జయభేరి, మే 23:
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిగిలిపోయిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి సూచించారు.

ఘట్ కేసర్ మండలం ఎదులాబాద్, మాదారం గ్రామాలలో పర్యటించిన ఆయన ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అనంతరం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కల్పిస్తున్న సదుపాయాలపై ఆరా తీశారు. అదేవిధంగా ధాన్యం తరలించిన రైతులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను సైతం అదనపు కలెక్టర్ పరిశీలించారు. రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని,సేకరించిన ధాన్యం వెంటనే లారీలలో లోడ్ చేయించి ఎప్పటికప్పుడు నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించాలని  సిబ్బందికి సూచించారు.

Read More సీఆర్ పీ ఎఫ్ పాఠశాలలో ప్రారంభమైన జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ సెలక్షన్ పోటీలు

rice2

Read More ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికే పెద్ద పీఠ 

అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తరలింపులో జాప్యానికి తావు లేకుండా చూడాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా తార్పాలిన్ ,గన్ని బ్యాగులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాల వల్ల ధాన్యం తడిసిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని అధికారులు వరకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

Read More ములుగు జిల్లా చల్పాక ఎన్ కౌంటర్ పై హైకోర్టులో నేడు విచారణ!

rice3

Read More సీసీ కెమెరాల ఏర్పాటుకు హెచ్ బి ఎల్  పరిశ్రమ సహకారం

అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థ వంతంగా నిర్వహిస్తూ తుది దశకు చేర్చాలని అన్నారు. ఇదే స్ఫూర్తితో పని చేస్తూ పూర్తిస్థాయి లక్ష్యానికి అనుగుణంగా దాన్యం సేకరణ జరపాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని తద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రాజేందర్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read More ముడుచింతలపల్లిలో గురువారం సాయిల్ హెల్త్ డే

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు

Social Links

Post Comment