Telangan I తలరాత మార్చే విద్య తల వంపులు పాలవుతోందా!?
14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు చదివే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో కనీసం రెండవ తరగతి పుస్తకం చదవని అద్వాన పరిస్థితి దాపురించింది అంటే ఇది ఎవరి తప్పు...
జయభేరి, హైదరాబాద్ :
దాదాపు 20 ఏళ్ల నుండి ప్రాథమిక ఉన్నత స్థాయి విద్యా ప్రమాణాలు నాసిరకంగా మారిపోయాయి.. ప్రపంచంలో అనేక దేశాల్లో విద్య ప్రమాణాలు వాటి బలోపేతానికి చర్యలు తీసుకుంటున్న గత పదేళ్లుగా భారతదేశంలో విద్యా ప్రమాణాలు, విద్య వ్యవస్థ గాలికి వదిలేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇటు మన భారతదేశంలో కేంద్రం రాష్ట్రం రెండింటి వైఫల్యం మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్లో కనీసం 20% విద్య వ్యవస్థకు బడ్జెట్ను కేటాయించని పరిస్థితి.. గతంలో కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పై బడ్జెట్ను 24 నుంచి 25% బడ్జెట్ను ప్రవేశపెట్టే విధానంలో కనీసం 10% కూడా విద్య వ్యవస్థ పై బడ్జెట్ను కేటాయించలేదు.. అదే మన రాష్ట్ర ప్రభుత్వం 20% బడ్జెట్ను కూడా కేటాయింపు చేపట్టలేదు..
అసర్ నివేదిక సర్వే ప్రకారం 20 ఏళ్ల నుండి విద్య ప్రమాణాలు నాసిరకంగా మారిపోయాయని కనీసం డిగ్రీ చదివే విద్యార్థి విద్యార్థినులు రెండవ తరగతి పుస్తకం కూడా చదవని పరిస్థితి దాపురిస్తుంది అని ఇది కేవలం 16 నుంచి 18 వయసులో ఉన్న వాళ్ళు కు ఈ పరిస్థితి కనిపించిందని గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో పూర్తిగా విద్యా ప్రమాణాలు లోపించాయని దీనిపై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుండబద్దలు కొట్టినట్టుగా తేల్చి చెప్పింది..
అంటే పట్టణ సామర్థ్యం పూర్తిగా విద్యార్థి విద్యార్థినీ విద్యార్థులు దెబ్బతింది అని మనకు చెప్పకనే తెలుస్తోంది.. ఇక ప్రాథమిక ఉన్నత పాఠశాల సామర్థ్యాన్ని మనం పరిశీలిస్తే... సగం మంది అంటే 50% ప్రైవేటు సెక్టార్లలో 50% మంది ప్రభుత్వ పాఠశాలల్లో వైద్యను అభ్యసిస్తున్నారు. మన రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నట్టుగా అసార్ సర్వే తేల్చి చెప్పింది..
ప్రైవేట్ విద్య శాఖ పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు బడ్జెట్ను కేటాయించదు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో బడ్జెట్ను కేటాయించి మౌలిక అంశాలు ప్రాథమిక పాఠశాలలో కావలసిన అవసరాలకు సరిపడా బడ్జెట్ను కేటాయిస్తే ప్రభుత్వ పాఠశాలలు మళ్లీ జీవం పోసుకుంటాయి.. కానీ గత పదిహేళ్లుగా మండల విద్య అధికారులను గాని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గానీ ఇలా ఎన్నో పోస్టులు ఖాళీగానే పడి ఉన్నాయి.. అంటే విద్య వ్యవస్థ పై ప్రభుత్వం జవాబిదారితనం పూర్తిగా లోపించింది..
ఒక వ్యక్తి యొక్క ఉన్నత ప్రమాణాలు సంస్కారం జీవన విధానం తలరాతను మార్చే విద్య నేటి సమాజానికి తల వంపులు తీసుకువస్తున్నది. సందర్భంలో 2024 సంవత్సరంలో 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఎక్కువగా 9 10 12 తరగతి చదువుతున్న విద్యార్థులు పఠనాసక్తి తగ్గి గణిత సామర్థ్యం పూర్తిగా దెబ్బతిని చదువు సగం మధ్యలోనే ఆపేస్తున్నారు..
2021 నూతన విద్యా విధానం పూర్తిగా డొల్లతనంగా మారిపోయింది. ప్రభుత్వ రంగంలో ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి.. 34,788 మందిని నివేదిక 14 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులను ఎనిమిది కోట్ల మందిలో సర్వేను నిర్వహించింది. ఈ సర్వే 28 జిల్లాల్లో 26 రాష్ట్రాల నుండి విద్య ప్రమాణాలు ఎలా ఉన్నాయో అని తేల్చి వేయడానికి అస్సర్ నివేదిక ఈ సర్వే ను చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది...
మన భారతదేశం అన్ని దేశాల్లో కల్ల యువత ఎక్కువగా ఉన్న దేశం అంటే యువదేశంగా మన దేశాన్ని అభివర్ణించుకోవచ్చు. కానీ మన దేశంలో 87% యువత మధ్యలో స్కూల్ వదిలేసి కుటుంబ పనులకి అలవాటు పడిపోయి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇతర పనికి 13% మంది విద్యార్థులు కుటుంబ పోషణకై పోరాడుతున్నారు. మొత్తానికి 90% మంది విద్యార్థి విద్యార్థులు కుటుంబాలకు సాయం చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు తమ జీవితాలను చదువు వైపు దృష్టి మళ్లించగా వ్యవసాయానికి అలవాటు పడిపోతున్నారు.. ఇంకెక్కడి విద్యా ప్రమాణాలు? ఇంకెక్కడి విద్యాశాఖ!?
ఇలా కుటుంబ అవసరాల కోసం విద్యను మధ్యలోనే వదిలేసి అడవి పనికి అలవాటు పడ్డ విద్యార్థులు వారి యొక్క మేధో వికాసం పెడదోవ పట్టి అనేక అసాంఘిక కార్యక్రమాలకు పూలుకుంటుంది..
గత రెండున్నర దశాబ్దాలుగా విద్య ప్రమాణాలు బోధన మూల్యాంకనాలు చిన్నాభిన్నం అయిపోయాయి.. గత ప్రభుత్వాలు అస్సలు విద్యాశాఖను పట్టించుకోలేదు. దీనికి ఉదాహరణకు గత కొన్ని ఏళ్లుగా ఎంఈఓ డిఈఓ ఇలాంటి ఎన్నో విద్యాశాఖలో ఉన్న అధికారుల ఉద్యోగ భర్తీకి ప్రభుత్వాలు ముందడుగు వేయలేదు.. కేవలం ప్రభుత్వ అధికారులు విద్యాశాఖలో మూల్యాంకణాల కోసం అయినా విద్యా ప్రమాణాల కోసం అయినా కేవలం ఆప్ ల మీద ప్రభుత్వం ఆధారపడి మనుషులు చేయాల్సిన పనిని యంత్రాలపై వదిలేసి విద్యావ్యవస్థను గాలికి వదిలేశారు... ఇలా చూసుకుంటే విద్యాశాఖలో పనిచేస్తున్న టీచర్స్ కి గత 15సం!!లలో జీతాలు సరిగ్గా రాక పదోన్నతి లేక దాదాపు 8 ఏళ్లుగా విద్యాశాఖ ప్రజలకు జవాబు దారితనం లేకుండా పోయింది. సర్వేలు రిపోర్టులు అన్ని ఇదే విషయాన్ని తేల్చేయి కేవలం ఆప్ ల మీదనే శిక్షణ పొందుతున్న టీచర్స్ కొంతమందితోనే విద్య వ్యవస్థ నడుస్తోంది..
ఇక తాజాగా కొఠారి కమిషన్ విద్య వ్యవస్థ పై బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం 10% కేటాయిస్తుంది. కానీ 26% కేటాయించాలి.. అదే రాష్ట్ర ప్రభుత్వం 20% బడ్జెట్ను ప్రవేశ పెట్టాల్సిన సమయంలో 12% బడ్జెట్ను ప్రవేశపెడుతూ తూతు మంత్రం గానే విద్య వ్యవస్థను నడిపిస్తుంది అని కొఠారి కమిషన్ రిపోర్ట్ తేల్చింది.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన ఈ సమయంలో బడ్జెట్ను ప్రవేశపెట్టి ఈ తరుణంలో విద్యా వ్యవస్థను పూర్తిగా పట్టించుకోని 20% బడ్జెట్లో విద్య వ్యవస్థను కేటాయించాలి. ప్రాథమిక పాఠశాల పునర్వ్యవస్థీకరణ తప్పకుండా చేయాలి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలకు అలవాటు కావడానికి ఫ్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉదాహరణకు పశ్చిమ సోషలిస్టు ఆయా దేశాల్లో అలాగే శ్రీలంక బంగ్లాదేశ్ ఈ దేశాల్లో విద్యా ప్రమాణాల కోసం విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ బడ్జెట్లో 20% కంటే ఎక్కువ అక్కడి ప్రభుత్వాలు విద్యావ్యవస్థ పై ఖర్చు చేసి యువతలో విద్యా ప్రమాణాలు పెంపొందింప చేస్తుంది.. కానీ మన దేశంలో ఎందుకు వివక్ష విద్య వ్యవస్థపై వెనుక పాటు తను ఏర్పాటుతోందనేది మనమే ఆలోచించుకోవాల్సిన విషయం..
కేరళ రాష్ట్రంలో ప్రభుత్వం విద్యా వ్యవస్థ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్య శిక్షణ వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసి దానికి కొంతమంది రిటైర్డ్ ప్రొఫెసర్ ను నియమించి ఆ వ్యవస్థకు పూర్తిగా స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించి మెరుగైన విద్యా ప్రమాణాలను కల్పించడం వల్ల కేరళ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఫలితాలను చూపించాయి.. మన రాష్ట్రంలో ఎస్ సి ఆర్ టి ఏర్పడిన చట్టం ప్రకారం విద్య ప్రణాళికలో అనేక మార్పులు చేర్పులు కావాలి. ప్రస్తుతం ప్రాథమిక విద్య పాఠశాల నుంచి ఎంఈఓ డీఈవో టీచర్స్ పోస్టుల ఖాళీలు ఇంతవరకు నింపలేదు.. కనీసం అకాడమిక్ క్యాలెండర్ ను కూడా చేయలేదు అంటే ఎస్సిఆర్టి అకాడమిక్ ఏర్పాటు చేసిన ఉపయోగం లేకుండా పోయింది.. ఎస్సీ ఆర్ టి యాక్టివ్ ప్రకారం 33 జిల్లాల్లో పదిమంది డిఈఓ ను ఉండాలి కానీ లేరు...
నేషనల్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ సర్వే ప్రకారం రాష్ట్రం విద్య దిశ దిశను పూర్తిగా మరిచిపోయింది అని తేల్చేసింది...
దీనికి ప్రధాన కారణం నిధులు కేటాయింపు నానాటికి నామం బొట్లు అన్నట్టుగా ఉపాధ్యాయ నియామకాలు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా జరగలేదు అంటే విద్యా వ్యవస్థ ఎంత దిగజారి పోతుందో మనందరం అర్థం చేసుకోవాలి... కొత్త ప్రభుత్వం వీటిపై దృష్టి సారించాలి...
1957లో కేరళ రాష్ట్రంలో ఉపాధి కోసం భూసంస్కరణలు జరిపి ప్రతి ఒక్క కుటుంబానికి వ్యవసాయ ఆధారిత భూమిని కేటాయించి తల్లిదండ్రులను ఆర్థికంగా బలోపేతం చేసింది ఆ రాష్ట్రం... కానీ మన రాష్ట్రం పూర్తిగా ఉపాధి హామీ పథకంలో కూడా పని దొరకకుండా చేసే విధంగా దళారీ వ్యవస్థ ఏర్పాటు అయిపోయి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది... దీనిపై ఎవరూ మాట్లాడరు నోరు మెదపరు.. మన దేశంలో దాదాపు 62 నుంచి 70 శాతం మంది బాలికలు చాలామంది అమ్మాయిలు చదువు మధ్యలోనే డ్రాప్ అవుట్ అవుతున్నారు అలా కావడానికి ప్రధాన కారణం కుటుంబంలో ఆర్థిక స్వేచ్ఛ లేకపోవడం దీని ద్వారా పదవ తరగతి ఇంటర్ అయిపోగానే పెళ్లిళ్లు చేస్తూ తమ బాధ్యతలు తీర్చుకుంటున్నారు ఆయా తల్లిదండ్రులు... ప్రభుత్వం ఎన్ని ఉచిత విద్య గురుకుల పాఠశాలలో నవోదయ పాఠశాలలు తీసుకువచ్చిన బడ్జెట్లో విద్యావ్యవస్థకు కనీస గౌరవ బడ్జెట్ను ప్రవేశ పెట్టకపోతే ఇవన్నీ వ్యర్థం అవ్వక ఇంకేమవుతుంది... చివరగా కొత్త ప్రభుత్వం ఇలాంటి వన్నీ గుర్తించి ప్రాథమిక విద్య ఉన్నత యూనివర్సిటీల విద్యా వ్యవస్థను బలుపేతం చేయడానికి ఎస్ సి ఆర్ టి యాక్టును బలోపేతం చేసి విద్యలు నాణ్యత ప్రమాణాలను పాటించాలి.
విద్య వ్యవస్థలు జరిగే లోపాలను నియంత్రణ చేస్తూ పని చేసే పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలి... విద్యా వ్యవస్థలో ప్రాథమిక దశ నుంచే ఉన్న ప్రాథమిక మౌలిక అంశాలపై దృష్టి సారించి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉంటుంది.... ఎంతైనా విద్య ప్రమాణాలు దెబ్బతింటే దేశం మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతుంది.. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించి విద్యాశాఖ పై బడ్జెట్ను గౌరవప్రదంగా ప్రవేశపెట్టాలని పలువురు... విద్యావేత్తలు సామాజిక బాధ్యత గల అధికారులు సూచిస్తున్నారు....
- కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, కవి, సీనియర్ రాజకీయ విశ్లేషకులు
9848 962 799
Post Comment