తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం
జయభేరి, హైదరాబాద్, సెప్టెంబర్ 24 : తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త సాంప్రదాయానికి నాంది పలుకుతుంది, ఈనెల 25 నుంచి గాంధీభవన్ లో మంత్రులతో ప్రజలు ముఖాముఖి కార్యక్రమం ప్రారంభం కానుంది,
పార్టీ, గాంధీభవన్, కార్య కర్తలు లేకుండా ప్రభుత్వమే లేదని, కార్యకర్తలకు మంత్రులు అందుబాటులో ఉండాలని చేసిన సూచనల మేరకు బుధవారం నుంచి మంత్రులు గాంధీభవన్‌లో కార్యకర్తలకు అందుబాటు లో ఉండబోతున్నారు.
ప్రతి బుధ, శుక్రవారాలు మంత్రులు గాంధీభవన్ రానున్నారు. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రతి వారం ఇద్దరు మంత్రులు, నెలకోసారి ముఖ్యమంత్రి గాంధీభవన్‌కు వచ్చి ప్రజలు, పార్టీ కార్యకర్తల కష్టసుఖాలు తెలుసు కునేందుకు షెడ్యూల్ ఖరారుచేశారు.
గత శుక్రవారం నుంచే ఈ ముఖాముఖి కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా మంత్రి వర్గ సమావేశం ఉన్నందున వాయిదా పడింది. వాయిదా పడిన ఈ కార్యక్రమం ఈబుధ వారం నుంచే మొదలుకా నుంది. ఈ నెలతో పాటు అక్టోబర్ నెలలో మంత్రుల ముఖాముఖి షెడ్యూల్ కూడా ఖరారైంది.
ఈ నెల 25న బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర సింహ ,రానున్నారు. 27న డి శ్రీధర్ బాబు, అక్టోబర్ 4న ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, 9న పొన్నం ప్రభాకర్, 11న డి అనసూయ సీతక్క, 16న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పాటు...
18న కొండా సురేఖ, 23న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 25న జూపల్లి కృష్ణారావు, 30న తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కార్యకర్తలతో, ప్రజల తో, మంత్రులు అందుబాటు లో ఉండనున్నారు.
Post Comment