Telangana I జంప్ జిలానీల తో ఎల్బీనగర్ తికమక

కాసుల కోసం ఇంతగా రాజకీయాన్ని వాడుకునే నేతలను చూస్తే ప్రజాస్వామ్యం సిగ్గుపడుతుంది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

Telangana I జంప్ జిలానీల తో  ఎల్బీనగర్ తికమక

జయభేరి, హైద‌రాబాద్ : ఎల్బీనగర్ నియోజకవర్గంలో జంపు జిలానిలో ఎంతమంది ఉన్నా కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా అడుగులు వేస్తోంది.. నిజానికి ఎల్బీనగర్ నియోజకవర్గం లో కాంగ్రెస్లోకి వలసలు వచ్చిన తిరిగి సొంత గూటిలోకి వెళుతున్న నాయకులను చూస్తే ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు... ఇంతటి అవకాశవాద రాజకీయం ఎక్కడ చూడలేదంటూ బాహటంగానే ఆరోపణలు చేస్తున్నారు.. ఎందుకోసం ఆ నేత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు ఎందుకోసం మళ్లీ సొంతగూటికి చేరాడు ఇప్పటికే ప్రజలకు దాదాపు అర్థమయిపోయింది...

కాసుల కోసం ఇంతగా రాజకీయాన్ని వాడుకునే నేతలను చూస్తే ప్రజాస్వామ్యం సిగ్గుపడుతుంది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. ఇక ఎల్బీనగర్ నియోజకవర్గంలో సర్వేలు చూసుకున్న జననాడిని విన్న కాంగ్రెస్ పార్టీ విజయం గంట పదంగా చెబుతున్నాయి... ఒకవైపు నామినేషన్ల గడువు దగ్గర పడుతుండడంతో రాజకీయంగా ఎల్బీనగర్లో నాటకీయ పరిణామాలతో రూపుదిద్దుకుంటున్న ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజలు దాదాపు కాంగ్రెస్కి తమ ఓటును వేసే దిశగా కాలమే దారి చూపిస్తోంది అంటూ కాంగ్రెస్ నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు..

Read More యువత ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చాక కాకుండా ముందు నుండే సిద్ధంగా ఉండాలి...

నిజానికి ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎక్కువగా వలస వచ్చిన ప్రాంత ప్రజలు ఇక్కడ సెటిలర్స్ గా ఉంటారు. మరి అలాంటి వారు తమ నమ్ముకున్న నాయకునికి అండదండగా ఉంటూ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత తెలంగాణ సెంటిమెంటుతో బి. అర్ స్ ను అధికారంలోకి తీసుకొచ్చారు తెలంగాణ ప్రజలు... ఎల్బీనగర్ నియోజకవర్గం అంటేనే పోరాటానికి ఒక దారి చూపిన నియోజకవర్గం గా చరిత్ర పుటల్లో ఉన్న ఇక్కడ రాజకీయాలు చూస్తే మాత్రం అపహస్యకంగా మారిపోతున్నాయి...

Read More నీ తాటాకు చప్పులకు భయపడేది లేదు రేవంత్ రెడ్డి

నాయకుల వలసలు తీరుతెన్నిలో గమనిస్తూ ప్రజలు నిషితగా పరిశీలిస్తున్నారు... ఇక సర్వేలైతే పూర్తిగా కాంగ్రెస్కే అధికారాన్ని ప్రజలు కట్టబెడతారు అని తేల్చేస్తున్నాయి... చూద్దాం నవంబర్ 30 వ తారీఖున జరగబోయే ఎలక్షన్లలో ఎల్బీనగర్ గడ్డ కాంగ్రెస్ కి అడ్డంగా మారుతుందా లేకుంటే ప్రజలు మళ్ళీ అధికార పార్టీకే పటం కడతారా అనే విషయం రిజల్ట్ తర్వాత చూడాల్సిందే...

Read More సీసీ కెమెరాల ఏర్పాటుకు హెచ్ బి ఎల్  పరిశ్రమ సహకారం

... కడారి శ్రీనివాస్
సీనియర్ జర్నలిస్ట్

Read More భగవాన్ సత్యసాయి పుట్టినరోజు మహిళా వృద్ధుల ఆశ్రమ నిర్మాణమునకు రు. 50,116 విరాళం 

Latest News

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి