Telangana I గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (గోపా) 42వ వన భోజన కార్యక్రమం
హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
జయభేరి, హైదరాబాద్ :
గౌడుల ఐక్యత పరస్పర సంబంధాల మెరుగు కోసం ప్రతి సంవత్సరం గోపా వనభోజనాలను నిర్వహిస్తుందని సంస్థ అధ్యక్షులు ఎం రమేష్ బాబు గౌడ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బండి సాయన్న గౌడ్, కోశాధికారి మొగిలి రఘునాథ్ గౌడ్ తెలిపారు. ప్రజా ప్రతినిధులతో పాటు సంస్థ సభ్యులైన పలువురు అధికారులు, వృత్తి నిపుణులు, వివిధ గౌడ సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సంస్థ సభ్యులు, వారి కుటుంబ సభ్యుల ఆటపాటలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సాగిన ఈ కార్యక్రమం ఎంతో కోలాహలంగా జరిగింది. ముఖ్యఅతిథి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇలా అందర్నీ కలుసుకోవడం తనకెంతో సంతోషం కలిగించిందని సమాజంలో గౌడ్ల అభివృద్ధికి తాను తప్పక కృషి చేస్తానని ఈ సందర్భంగా అన్నారు.
అనంతరం ఆటపాటల్లో గెలిచిన విజేతలకు అతిథులు బహుమతులతో సత్కరించారు. ఈ రాష్ట్ర స్థాయి వనభోజన కార్యక్రమానికి వివిధ జిల్లాలు, మండల గోపా యూనిట్ల సభ్యులు కూడా హాజరయ్యారు.
Post Comment