TS TET 2024 Updates : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్... వెబ్‌సైట్‌లో ఆ ‘ఆప్షన్’ వచ్చేసింది..!

దరఖాస్తుల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించారు.

TS TET 2024 Updates : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్... వెబ్‌సైట్‌లో ఆ ‘ఆప్షన్’ వచ్చేసింది..!

తెలంగాణ టెట్ అప్లికేషన్స్ (TS TET Applications)కి సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు... ఎడిట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు వెబ్‌సైట్‌లో ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

తెలంగాణ టెట్ (TS TET 2024) దరఖాస్తు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విద్యాశాఖ ఓ అప్ డేట్ ఇచ్చింది. దరఖాస్తుల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు వెబ్‌సైట్‌లో ఎడిట్ (TS TET 2024 Application Edit option) ఆప్షన్‌ను అందుబాటులో ఉంచారు. మీరు ఈ సవరణ ఎంపికతో మీ అప్లికేషన్‌ను సవరించవచ్చు. అయితే ఈ అవకాశం ఒక్కసారి మాత్రమే. ఒకసారి ఎడిట్ చేసి సబ్మిట్ చేస్తే... మళ్లీ ఎడిట్ చేసే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు.

Read More యువత ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చాక కాకుండా ముందు నుండే సిద్ధంగా ఉండాలి...

TS-TET-result-2022

Read More కాంగ్రెస్ గెలుపుపై గజ్వేల్ లో సంబరాలు

TS TET 2024 Application Edit option : ఇలా ఎడిట్ చేసుకోండి…
తెలంగాణ టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
హోమ్ పేజీలో ఎడిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
ఇక్కడ Journal Number/Payment Reference ID, (Date of Birth) పుట్టిన తేదీని నమోదు చేసి సమర్పించాలి.
మీ అప్లికేషన్ తెరవబడుతుంది. మీరు మీ వివరాలను సవరించవచ్చు.
చివరగా మీ దరఖాస్తును సమర్పించి, సవరించండి.
ప్రింట్ అప్లికేషన్‌పై క్లిక్ చేసి, మీ దరఖాస్తు ఫారమ్‌ను పొందండి.

Read More రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు  కలెక్టర్

aa-504220-1648194724

Read More ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి

How to Apply TS TET 2024 : టెట్ కు ఇలా దరఖాస్తు చేసుకోండి
టెట్ రాయడానికి అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
ముందుగా ‘Fee Payment’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, నిర్ణీత రుసుమును చెల్లించండి.
చెల్లింపు స్థితి కాలమ్‌పై క్లిక్ చేసి దరఖాస్తు రుసుము చెల్లింపు ప్రక్రియ పూర్తయిందా..? లేదా తనిఖీ చేయాలి.
ఆ తర్వాత  ‘Application Submission’ లింక్‌పై క్లిక్ చేయండి.
మీ వివరాలను నమోదు చేయండి. ఫొటో, సంతకం తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.
అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి చివరిలో సమర్పించు బటన్‌పై క్లిక్ చేయండి.
'Print Application' ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా మీరు మీ అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ చేయవచ్చు.
రిజిస్ట్రేషన్ నంబర్‌ను జాగ్రత్తగా ఉంచండి. హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ నంబర్ ఉపయోగపడుతుంది.

Read More గూగుల్ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం

ts-icet-registration

Read More ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 

TS TET Dates 2024 : తెలంగాణ టెట్ ముఖ్య తేదీలు:
తెలంగాణ టెట్ దరఖాస్తులకు చివరి తేదీ – ఏప్రిల్ 20, 2024.
హాల్ టిక్కెట్లు - మే 15, 2024.
పరీక్షల ప్రారంభం - మే 20, 2024.
పరీక్షల ముగింపు – జూన్ 06,2024.
టెట్ ఫలితాలు – జూన్ 12, 2024.
అధికారిక వెబ్‌సైట్ - https://schooledu.telangana.gov.in/ISMS/

Read More శ్రీ విష్ణు శివాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు

Latest News

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 

Social Links

Post Comment