గ్రేటర్ సిటీలో తాగునీటి కష్టాలు తీరనున్నాయి
ఈ ఏడాది సమ్మర్‌లో హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. నగరానికి ప్రధానంగా తాగు నీరు అందించే జంట జలశాయాలు.. గండిపేట, హిమాయత్ సాగర్‌లోనూ నీరు డెడ్ స్టోరేజీకి చేరుకుంది.
హైదరాబాద్ నగర ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మరికొద్ది రోజుల్లోనే నగరవాసులకు నీరు అందించే రిజర్వాయర్లు పూర్తిగా నిండే అవకాశం ఉంది. ప్రధానంగా జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్ సాగర్ జలశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి. రాష్ట్రంలో కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండటం, పరీవాహక ప్రాంతాలైన సింగూరు, మంజీరా, ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లకు భారీగా వరదనీరు వస్తుండటంతో నీటి కష్టాలకు చెక్ పడనుంది.
Latest News
ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
27 Dec 2024 10:14:56
జయభేరి, సైదాపూర్ : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
Post Comment