తుంకుంట మున్సిపల్ పరిధిలో వన మహోత్సవం
పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ మొక్కలు నాటాలని పిలుపు
జయభేరి, జులై 16: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని తుంకుంట మున్సిపల్ కమిషనర్ ఆర్. వెంకట గోపాల్, మున్సిపల్ చైర్మన్ కారంగుల రాజేశ్వర్ రావు లు తెలిపారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా తుంకుంట మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు పోతాయిపల్లి లోని ప్రభుత్వ పార్కులో మొక్కలు నాటారు.
నేటి నుంచి ప్రతీ రోజు మున్సిపల్ పరిధిలోని 16 వార్డులలో వన మహోత్సవం కార్యక్రమం చేపడతామని, ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనీ మొక్కలు నాటాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ తీగుళ్ల హరిబాబు, 11 వ వార్డు కౌన్సిలర్ నర్సింగరావు గౌడ్, కో ఆప్షన్ సభ్యులు మిర్జా షఫీ, ఉల్లా భేగ్, మున్సిపల్ మేనేజర్ శ్రవణ్ కుమార్. బిల్ కలెక్టర్లు, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read More అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా
Latest News
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
11 Dec 2024 15:37:30
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
Post Comment