మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు బలం

మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు బలం

మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి సాధికారతతో పాటు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు బలమని, సమాజ శ్రేయస్సుకు అదే పునాది అన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం కోసం మరిన్ని ఆసుపత్రులు నిర్మిస్తామని, సంబంధిత వ్యవస్థలను బలోపేతం చేస్తామని తెలిపారు.

బ్రెస్ట్ క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సుధా రెడ్డి ఫౌండేషన్ నేతృత్వంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన 'పింక్ పవర్ రన్' కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పక్షి అకృతిలో అతిపెద్ద మానవహారంగా ఏర్పడిన వలంటీర్లను అభినందించారు.

Read More నీ తాటాకు చప్పులకు భయపడేది లేదు రేవంత్ రెడ్డి

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పలువురు వైద్యులు, సుధా రెడ్డి ఫౌండేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు.

Read More ముడుచింతలపల్లిలో గురువారం సాయిల్ హెల్త్ డే

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు