విద్యుత్తుశాఖ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా

 విద్యుత్తుశాఖ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా

కరీంనగర్‌ :

లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(అనిశా)అధికారులకు చిక్కిన విద్యుత్తుశాఖ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్‌ అనిశా ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు.. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం సిరి చెల్మకు చెందిన గాండ్ల కన్నమయ్య ప్రభుత్వం తత్కాల్‌ స్కీం ద్వారా వ్యవసాయ భూములకు విద్యుత్తు సరఫరా చేస్తుందని తెలిసి మరికొంత మంది రైతులతో కలిసి 2010 అక్టోబరు 12న దరఖాస్తు చేసుకున్నారు. అది స్థానిక అధికారుల నుంచి ఆదిలాబాద్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ రేగుంట స్వామికి చేరడంతో వెళ్లి ఆయన్ను కలిశారు. ఆయన రూ.30 వేలు డిమాండ్‌ చేశాడు. అంత మొత్తం ఇచ్చుకోలేమని చెప్పడంతో రూ.15 వేలు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పాడు. దీంతో రైతులు 2010 నవంబరు 18న అనిశా అధికారులను ఆశ్రయించారు. రైతుల నుంచి స్వామి రూ.15 వేలు తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకుని, కేసు నమోదు చేశారు. ప్రాసిక్యూషన్‌ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కిషోర్‌కుమార్‌ వాదించారు. న్యాయమూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించి స్వామికి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.30 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

Read More ప్రపంచం కమ్యూనిస్టుల వైపు చూస్తున్నది... 

Latest News

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 

Social Links

Related Posts

Post Comment