ఏపీలో విచిత్రమైన ఘటన జరిగింది. రైలు పేరొకటి.. కానీ వెళ్లే రూటు మరొకటి.

ఏపీలో విచిత్రమైన ఘటన జరిగింది. రైలు పేరొకటి.. కానీ వెళ్లే రూటు మరొకటి.

శుక్రవారం ఉదయం 10.02 గంటల సమయంలో.. కొత్తవలస రైల్వేస్టేషన్‌కు తొమ్మిది గంటలకు రావాల్సిన విశాఖపట్నం- అరకు (08525) దసరా స్పెషల్‌ రైలు గంటకు పైగా ఆలస్యం కాగా.. ప్రయాణికులు వేచి ఉన్నారు.

ఈలోపు అరకు స్పెషల్‌ రైలు వస్తున్నట్లు అనౌన్స్‌మెంటు చేయడంతో.. ప్రయాణికులు లేచి ఆ రైలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. కానీ ఇంతలో తాంబరం నుంచి బెంగాల్‌ వెళ్లే రైలు స్టేషన్‌కు వచ్చింది. ఆ వెంటనే మరో రైలు వచ్చి వెళ్లింది.

Read More వరద బాధితుల సహాయార్థం సేకరించిన విరాళాలు 

ఆ రెండు రైళ్లు వచ్చిన వెళ్లిన తర్వాత మచిలీపట్నం, విశాఖపట్నం పేరుతో మరో రైలు వచ్చి ప్లాట్‌ఫాంపై వచ్చి ఆగింది. ఈ రైలుకు ఎలాంటి అనౌన్స్‌మెంటు లేదు. ప్లాట్‌ఫామ్‌పై వ్యాపారాలు చేసుకునే వాళ్లు అరకు రైలు వచ్చింది త్వరగా ఎక్కండి అంటూ పెద్దగా కేకలు వేశారు. కానీ ఆ రైలుపై ఉన్న బోర్డులు మాత్రం మరోలా కనిపిస్తుండంతో అరకు రైలు అవునా కాదా అన్న కన్ఫ్యూజన్ ఉంది.

Read More కాంగ్రెస్ లో వైసీపీ విలీనమేనా..?

అయితే క్యాంటీన్‌ వ్యాపారుల సమాచారంతో ఒక్కసారిగా ప్రయాణికులు పరుగులు తీశారు. కానీ రైలుపై సరైన సమాచారం తెలిపే బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో కొద్దిసేపు గందరగోళం కనిపించింది. మహిళలు, చిన్నారులతో రైలు ఎక్కేందుకు ఇబ్బందిపడ్డారు.. ఈ అంశంపై అధికారులు దృష్టి సారించాలని ప్రయాణికులు, పర్యాటకులు కోరుతున్నారు. ఇలాంటి సందిగ్థం లేకుండా చూడాలంటున్నారు.

Read More అంతుచిక్కని రోజా వ్యూహం....