ఘనంగా మదర్ తెరిసా 114 జయంతి వేడుకలు

ఘనంగా మదర్ తెరిసా 114 జయంతి వేడుకలు

జయభేరి ప్రతినిధి కైకలూరు: ఉపాధ్యాయ వృత్తిని వీడి అభాగ్యుల పాలిట దైవంగా మారిన మానవతామూర్తి మదర్ థెరిస్సా 114వ జయంతి వేడుకలను  కలిదిండి మండలం కోరు TVకోల్లు ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి లో సోమవారం విగ్రహ దాత శ్రీ చెన్నంశెట్టి కోదండరామయ్య వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు.

ఆసుపత్రి వేద్యులు శ్రీ డాక్టర్ అర్బర్ ఉస్మాన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోదండ రామయ్య మనవలు శ్రీ తోట అభినవ్,శ్రీ చెన్నం శెట్టి సత్య లు ఆస్పత్రి రోగులకు పళ్ళు, స్వీట్లు పంచిపెట్టి థెరిస్సా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు.

Read More ఘనంగా బండారు శ్రీను గురుస్వామి అయ్యప్ప పడిపూజ