Jagan : బీజేపీ బానిస జగన్

షర్మిల ఘాటు వ్యాఖ్యలు

Jagan : బీజేపీ బానిస జగన్

జయభేరి, కడప :
కడప జిల్లాలో జగన్, అవినాష్ రెడ్డిలే లక్ష్యంగా ఏపీపీసీసీ అధినేత్రి షర్మిల బస్సుయాత్ర కొనసాగుతోంది. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీకి జగన్ మోహన్ రెడ్డి బానిస అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ ఎప్పుడూ బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవారని గుర్తు చేశారు. ఇలాంటి ముస్లింలకు జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బస్సు యాత్రలో షర్మిల ఇంకా ఏమన్నారంటే... "వైఎస్ఆర్ ఎప్పుడూ బీజేపీ వ్యతిరేకి.. మతం పేరుతో గొడవలు సృష్టించేది బీజేపీ.. వైఎస్ఆర్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి బానిస. అందుకే జగన్ సమాధానం చెప్పాలి.

ముస్లింలు.. మణిపూర్ లో దాడులు జరిగితే నోరు విప్పని జగన్ - బీజేపీకి బానిస అయిన జగన్ వైఎస్ఆర్ వారసుడు ఎలా ఉన్నాడు.. ముస్లింలకు జగన్ ఎన్నో వాగ్దానాలు చేశారు.. ఇమామ్ లకు 15 వేల జీతం అన్నారు.. ముస్లిం బ్యాంకు అన్నారు. మరణిస్తే 5 లక్షల ఇన్సూరెన్స్‌ ఇస్తానన్నాడు.. ఎన్నో హామీలు ఇచ్చి మరిచిపోయారు. అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ముస్లింల పక్షాన నిలబడేది కాంగ్రెస్ ఒక్కటేనని షర్మిల అన్నారు. బాబు, జగన్ లు ముస్లింల పక్షాన లేరని తేల్చేశారు. బానిసలుగా మారిన బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నించారు. ‘‘విభజన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చని బీజేపీ.. హోదాపై బీజేపీ మోసం చేసింది.. వైఎస్ఆర్ బతికి ఉంటే కడప ఉక్కు పూర్తయ్యేది.. కడప ఉక్కు శంకుస్థాపన కింద మూడుసార్లు శంకుస్థాపన చేశారు.. ఎంపీలు నిద్రపోతున్నారు.

Read More భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొన్న ఎంపీపీ పైల, మాజీ సర్పంచ్ చుక్కా

కడప ఉక్కుపై స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్కరోజు కూడా నోరు మెదపలేదు.. కడప-బెంగళూరు రైల్వేలైన్ వైఎస్ఆర్ ఆశయం. జగన్ కు కడప లైన్ అక్కర్లేదు." అని విమర్శించారు. అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా ముద్ర వేసిందని షర్మిల... జగన్ నిందితుడిగా ఉన్న వ్యక్తికి టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. బాబాయి హత్య కేసులో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారు.. అసలు నిజాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు.. సీబీఐ విచారణ ఎందుకు జరగడం లేదు.. నేరం చేయకపోతే విచారణకు ఎందుకు అడ్డుపడుతున్నారు.. నిందితులను ఎందుకు కాపాడుతున్నారు? వీటికి జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించే వారికి కడప జిల్లా ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నిందితుడిగా సీబీఐ చెబుతున్న అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చి పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. కడప ప్రజలకు అందుబాటులో ఉంటానని... వైఎస్ఆర్ గణానికి సేవ చేస్తానని షర్మిల హామీ ఇచ్చారు.

Read More ఘనంగా మదర్ తెరిసా 114 జయంతి వేడుకలు

Latest News

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి