అపార నష్టాన్ని మిగిల్చిన వానలు

కాట్రేనికోన మండ‌లం కుండ‌లేశ్వరం వ‌ద్ద పంట కాలువ వైపు కుంగిన ఏటి గ‌ట్టును కోన‌సీమ జిల్లా క‌లెక్టర్ మ‌హేష్ కుమార్ ప‌రిశీలించారు. కోటిప‌ల్లి రేవులో ప‌డ‌వ ప్రయాణాలు నిలిపివేశారు. నిడ‌ద‌వోలు, న‌ల్లజ‌ర్లలో భారీ వ‌ర్షంలోనే తూర్పుగోదావ‌రి జిల్లా క‌లెక్టర్ పి. ప్రశాంతి ప‌ర్యవేక్షణ చేశారు. కాకినాడ జిల్లాలో సామ‌ర్లకోట మండ‌లంలో పంట పొలాల‌న్నీ నీట మునిగాయి. ఏలేరు, తూర్పు డెల్లా పరిధిలో కాలువ‌లు పొంగిపొర్లుతున్నాయి. తూర్పుగోదావ‌రి జిల్లాలోని ధ‌వ‌ళేశ్వరంలో 8.70 అడుగుల నీటిమ‌ట్టం న‌మోదు అయింది.

అపార నష్టాన్ని మిగిల్చిన వానలు

ఏలూరు, జూలై 23 :
ఇటీవ‌లి భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావ‌రి జిల్లా అత‌లాకుత‌లం అయ్యాయి. పంట మున‌క‌తో రైతులు తీవ్రంగా న‌ష్టపోయారు. అలాగే తూర్పుగోదావ‌రి ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. నిత్యం ప‌చ్చగా ఉండే కోన‌సీమ ప్రాంత‌మంతా నీటి ముంపులో ఉంది;

కాకినాడ ప్రాంతంలో తీర ప్రాంతంలో ప్రజ‌లు స‌ముద్ర కోత‌తో ప్రజలు అర‌చేతిలో ప్రాణాలు పెట్టుకుని భ‌యంతో ఉన్నారు. రాజ‌మండ్రి ప్రాంతంలోని క‌డియం వంటి ప్రాంతాల్లో రోడ్లన్ని వాగుల‌ను త‌ల‌పిస్తున్నాయి. న‌ర్సరీలు, ఉద్యాన పంట‌లు నీటిలోనే ఉన్నాయి. అలాగే వ‌రి పొలాల‌న్నీ చెరువుల‌ను త‌ల‌పిస్తున్నాయికోన‌సీమ ప్రాంతంలో పంట‌లు నీట మునిగాయి. ప‌ల్లపు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. ఉండ్రాజ‌వ‌రం ఎర్ర కాలువ నీరు గ‌ట్లు తెంచుకోవ‌డంతో వ‌రి చేలు నీటితో ముంచెత్తాయి. కాట్రేనికోన మండ‌లం కుండ‌లేశ్వరం వ‌ద్ద పంట కాలువ వైపు కుంగిన ఏటి గ‌ట్టును కోన‌సీమ జిల్లా క‌లెక్టర్ మ‌హేష్ కుమార్ ప‌రిశీలించారు. కోటిప‌ల్లి రేవులో ప‌డ‌వ ప్రయాణాలు నిలిపివేశారు.

Read More ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఒక రోజు ముందుగానే...

నిడ‌ద‌వోలు, న‌ల్లజ‌ర్లలో భారీ వ‌ర్షంలోనే తూర్పుగోదావ‌రి జిల్లా క‌లెక్టర్ పి. ప్రశాంతి ప‌ర్యవేక్షణ చేశారు. కాకినాడ జిల్లాలో సామ‌ర్లకోట మండ‌లంలో పంట పొలాల‌న్నీ నీట మునిగాయి. ఏలేరు, తూర్పు డెల్లా పరిధిలో కాలువ‌లు పొంగిపొర్లుతున్నాయి. తూర్పుగోదావ‌రి జిల్లాలోని ధ‌వ‌ళేశ్వరంలో 8.70 అడుగుల నీటిమ‌ట్టం న‌మోదు అయింది. దీనిలో 4.09 ల‌క్షల క్యూసెక్కుల వ‌ర‌దనీటిని 175 గేట్ల ఎత్తి దిగువ‌కు విడిచిపెట్టారు. ధ‌వ‌లేశ్వరం కాట‌న్ బ్యారేజీ వ‌ద్ద మొద‌టి ప్రమాద హెచ్చరిక ఇచ్చారు.

Read More చిట్టి దోశెలతో రోజుకు 10 వేలు

దీంతో కోన‌సీమ జిల్లాలో ఏడు గ్రామాలు ముంపుకు గురుకానున్నాయి. రాజ‌మండ్రి పాత బ్రిడ్జి వ‌ద్ద 9 మీటర్లు నీటిమ‌ట్టం ఉంది. తూర్పు, ప‌శ్చిమ, మ‌ధ్య డెల్టా కాలుల‌కు 4,400 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేశారు. పోల‌వ‌రం ఎగువ కాఫ‌ర్ డ్యాం వ‌ద్ద నీటి మ‌ట్టం 30.600 మీట‌ర్లకు చేరింది. దీంతో దిగువ‌కు 5.87 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేయ‌డానికి సిద్ధప‌డ్డారు.అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని రాజ‌వొమ్మంగి, జీకే వీధి, ఎట‌పాక‌, మారేడుమిల్లు మండ‌లాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవ‌హిస్తున్నాయి.

Read More 11 నుంచి ఏపీ బడ్జెట్ భేటీ

దీంతో చాలా గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. వీఆర్ పురం మండ‌లంలో గోదావ‌రి న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాలైన తుమ్మలేరు పంచాయ‌తీ, శ్రీ‌రామ‌గిరి పంచాయ‌తీల్లో నాలుగు గ్రామాల చొప్పున ముంపులో ఉన్నాయి. వీరంత కొండ‌లు, గుట్టల‌పైకి ప‌రుగులుతీశారు. వీరి క‌నీసం అవ‌స‌రాలు తీర్చే నాధుడు కూడా లేడు.చింతూరు మండ‌లంలోని చీక‌టివాగు, సోకిలేరు, కొయ్యూరు వాగు, చంద్రవంక వాగులు ఉద్ధృతంగా ప్రవాహించ‌డంతో దాదాపు 70 గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. కొయ‌గురు వాగు వ‌ర‌ద దాటికి ర‌హ‌దారి కోత‌కు గురైంది. ఏలూరు జిల్లాలో దాదాపు 25 గ్రామాల‌కు రాక‌పోక‌లు స్తంభించాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండ‌లాల్లో ప్రజ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 40 వేల ఎక‌రాల పంటకు న‌ష్టం జ‌రిగింది. అందులో 2,751 ఎక‌రాల్లో వ‌రి నారు మ‌డులు దెబ్బతిన్నాయి. 20 మండ‌లాల్లో 263 గ్రామాల్లో పంట పొలాలు ముంపుకు గుర‌య్యాయి

Read More రైస్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు