ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఒక రోజు ముందుగానే...

ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఒక రోజు ముందుగానే...

ఏపీలో దసరా హాలిడేస్‌పై క్లారిటీ వచ్చేసింది. అక్టోబర్ 3 నుంచి 13 వరకూ 11 రోజుల సెలవులు ఇస్తున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ప్రకటన చేశారు. ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒక రోజు ముందుగానే సెలవులు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.  క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు కూడా ఇవే రోజుల్లో సెలవులు ఉండనున్నాయి. పాఠశాల విద్యపై రివ్యూ సందర్భంగా మంత్రి సెలవులపై ప్రకటన చేశారు.

రాష్ట్రంలో వరదల కారణంగా ఉపాధ్యాయ దినోత్సవం జరపలేకపోయామని.. నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే బాగా సెలబ్రేట్ చేయాలని, 14న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. గవర్నమెంట్ స్కూళ్లను బలోపేతం చేయాలని ఆదేశించారు. స్కూళ్లలో ఫలితాల మెరుగుదలపై ప్రతి క్వార్టర్‌కు రివ్యూ చేస్తామని చెప్పారు.

Read More ఏపీలో ఎన్నికలను తలపిస్తున్న మద్యం లాటరీ కేంద్రాలు

ఆ స్కూళ్లకు మంత్రి ప్రశంసలు… తాను ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేసిన సందర్భంలో శ్రీకాకుళం మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్, అకనంబట్టు హైస్కూళ్ల పని తీరు చక్కగా ఉన్న గుర్తించానన్నారు మంత్రి లోకేశ్. అక్కడి స్కూళ్లలో విద్యార్థుల హ్యాండ్ రైటింగ్, ఇతర స్కిల్స్ బాగున్నాయి.

Read More బడులు, దేవాలయాలు సమీపంలో నో వైన్ షాప్: ఎక్సైజ్ కమిషనర్