నిండా ముంచేస్తున్న సైబర్ నేరగాళ్లు
మీరు కరెంటు బిల్లు చెల్లించలేదంటూ మీ కరెంటు మీటర్ కట్ చేస్తామని ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కు ఫోన్ చేశారు సైబర్ కేటుగాళ్లు. తాను డబ్బులు చెల్లించినట్లు చెప్పినప్పటికీ వినకుండా ఓ లింకును పంపించి అందులో చెల్లించాల్సిందిగా బురిడీ కొట్టించారు. ఆ తర్వాత లింకును ఓపెన్ చేసి డబ్బులు చెల్లించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తాను మోసపోయినట్లు గ్రహించి బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించారు.
జయభేరి, హైదరాబాద్ :
ఇన్‌స్టా.. స్నాప్‌చాట్.. ఫేస్‌బుక్.. వాట్సాప్.. ఇలా అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి కొంతమంది సైబర్ నేరగాళ్లు నిలువునా దోచేస్తున్నారు. రోజూ కొన్ని వేల మంది అమాయకులు సైబర్ చీటర్స్ చేతిలో మోసపోయి.. లక్షలాది రూపాయల డబ్బు పోగొట్టుకుంటున్నారు.
గత కొంతకాలం నుంచి సైబర్ మాసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రధాన కూడళ్ల వద్ద, హాస్పిటల్స్ వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. మీరు కరెంటు బిల్లు చెల్లించలేదంటూ మీ కరెంటు మీటర్ కట్ చేస్తామని ఓ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కు ఫోన్ చేశారు సైబర్ కేటుగాళ్లు. తాను డబ్బులు చెల్లించినట్లు చెప్పినప్పటికీ వినకుండా ఓ లింకును పంపించి అందులో చెల్లించాల్సిందిగా బురిడీ కొట్టించారు. ఆ తర్వాత లింకును ఓపెన్ చేసి డబ్బులు చెల్లించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తాను మోసపోయినట్లు గ్రహించి బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించారు.
మరోవైపు ఫెడెక్స్ కొరియర్ పేరుతో వచ్చిన పార్సెల్‌లో డ్రగ్స్ ఉన్నాయని, నకిలీ డాక్యుమెంట్ సైతం మీరు తీసుకెళ్తున్నారు అంటూ భయభ్రాంతులను గురిచేసి డబ్బులను దోచుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు.ఈ విధంగా రకరకాల మోసాలకు పాల్పడుతున్న సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మధురానగర్, పంజాగుట్ట, బోరబండ, మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో తరచూ సిబ్బంది తోపాటు అధికారులు అవగాహన కార్యక్రమాలు ఇస్తున్నారు.
ఇక మోసపూరితమైన ఆన్‌లైన్ యాప్స్ లో పెట్టుబడులు పెట్టిన నష్టపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలని ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా కోరుతున్నారు. కస్టమర్ కేర్‌కు సంబంధించిన నెంబర్లను ఫోన్ లింక్స్ ను ఓపెన్ చేసి తమ అకౌంటు డీటెయిల్స్ ను అపరిచిత వ్యక్తులకు తెలియకుండా జాగ్రత్త పడాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. స్పామ్ లింక్‌లు, ఫ్రాడ్ అప్లికేషన్లను క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు.
Post Comment