Money : రూపాయి నీ రూపం ఏది!?

మంటగలిసిపోతున్న మానవ సంబంధాలు.. కరెన్సీ కట్టలకి ప్రాధాన్యతనిస్తున్న నేటి అనుబంధాలు ఆప్యాయతలు..!?

Money : రూపాయి నీ రూపం ఏది!?

జయభేరి, హైదరాబాద్ :

నిజం.. అక్షర సత్యం.. కాలం వేగంగా తరలిపోతున్న రోజుల్లో మానవ జీవితం ఆర్థిక భారంతో ముడిపడి మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోయి మనుషుల్లా ప్రవర్తించకుండా యంత్రాలుగా ప్రవర్తిస్తూ అనుబంధాలు ఆప్యాయతలు ప్రేమలు మమతాను రాగాలు ఇలాంటి పదాలను పుస్తకాల్లోనే మడిచి దాచి పెట్టారు. ఈ నేపద్యంలో 'జయభేరి' మానవ సంబంధాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మీ కందిస్తున్న కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ సమగ్ర విశ్లేషణ... మనసుతో చదవండి.. పెదాలతో కాదు సుమా!?

Read More జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో విఙ్ఞాన భారతి పాఠశాల విద్యార్థుల ప్రతిభ

తరం మారుతున్న కొద్దీ ఆలోచనలు మారుతున్నాయి. మనుషులు మారుతున్న కొద్ది అనుబంధాలు ఆప్యాయతలు కనుమరుగైపోతున్నాయి. కరెన్సీ కట్టలకు చిన్న పెద్ద ముసలి ముతక ఆడ మగ అధికారి అనధికారి  ఇలాంటి పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు సైతం కరెన్సీ మోజులో పడి అవినీతికి దాసోహమై బాధ్యతని మరిచిపోయే రోజుల్లో మనం ఇప్పుడు బతుకుతున్నాం. ఒక్కరన్న  గుండె మీద చేయి వేసుకొని ఒక్కసారి ఆలోచించుకోండి.. ప్రతిరోజు ఏదో ఒక దినపత్రికలో పొదలో ఒక పసిపాప అనే వార్తను మనం నిత్యం చదువుతూనే ఉంటాం. అంటే ఆడపిల్ల అంటే భారంతో కూడుకున్నది. ఇది నాకొద్దు అని ముళ్ళపొదలో, చెట్లకుప్పల్లో పారేసే నీచ సంస్కృతికి శ్రీకారం చుడుతుంది ఈ నాగరిక సమాజం. ఆడపిల్లంటే దేవత లక్ష్మి మహాలక్ష్మి లు అని ఒక వైపు కీర్తిస్తూనే, ఇంకోవైపు చెట్ల పొదల్లో ముళ్ల కంపల్లో పసిపాప అని చూడకుండా పారేసే తల్లిదండ్రులను మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆధునిక నాగరికతలో మనిషి మర యంత్రాలుగా మారిపోయి కాసులకే పట్టం కట్టే రోజుల్లో బంధాలు ఎక్కడ ఉంటాయి!?

Read More ఇది ఒక ధ్యాన అనుభవం

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ తాతయ్య మామ అత్త బాబాయి పెదనాన్న చిన్నమ్మ పెద్దమ్మ వదిన మరదళ్ళు ఇలా ఎన్నో సంబంధాలు అనుబంధాలు అల్లుకున్న పొదరిల్లు ఉమ్మడి కుటుంబాలుగా ఆ రోజుల్లో వెలసిల్లాయి. కానీ నేడు మనం బతుకుతున్న బతుకు ఏంటి!? పెళ్లి కాగానే వేరుబడి ప్రత్యేక కాపురం పెట్టి అమ్మానాన్నను చుట్టం చూపుగా చూసే సమాజంలో ఇప్పుడు మనం లేమా? ఇక అనుబంధాలు బంధాలు వీటి గురించి మాట్లాడితే అవి ఇప్పటీ తరానికి ముళ్ళ కంచెలు! ఈ బంధాలు బంధుత్వాలు ఇవన్నీ ట్రాష్ మనిషి ఒంటరిగానే పుట్టాడు ఒంటరిగానే పోతాడు. అయినా మనతో మనం సంపాదించుకున్న ఏ ఒక్క రూపాయి రాదు, ఎలా వచ్చామో అలానే వెళ్ళిపోతాం అనే వేద వాక్యాలను పటిస్తూనే మనిషి ఆశ చావకుండా దురాశతో కోట్ల డబ్బులను పోగేసుకొని బ్యాంకులను మనుషులను నమ్మిన వాళ్లను ఆఖరికి కన్న తల్లిదండ్రులను తోడబుట్టిన వాళ్లను సైతం మోసం చేసి కుటీల పన్నాగాలతో ఆస్తులు కూడగట్టుకొని అందరిని వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నాడు. చదువుకున్న చదువు, చేస్తున్న ఉద్యోగం ఏమి సంబంధం ఉండదు.

Read More నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి

ఎందుకంటే నాకు కడుపు ఉందండి! నా భార్య పిల్లలు నా కుటుంబాన్ని ఎవరు చూసుకోవాలి. సమయం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి! అనే ఒక నీచ సంస్కృతికి శ్రీకారం చుడుతూ మనిషి తనను తానే మరిచిపోతున్నాడు. తాను కూర్చున్న చెట్టు కొమ్మని తానే నరుక్కుంటున్నాడు. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోవడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కనీసం మానవత్వం అనే ఒకటి మనిషిని నిత్యం రగిలించేస్తూనే ఉన్న ఇంకోవైపు మనిషి కఠినత్వాన్ని ప్రదర్శిస్తూ సమాజంలో ఏదో గొప్ప సేవ చేస్తున్నాను! అన్నట్టు ఒక్క మంచి పని చేసి మీడియాలో  గొప్పలకు పోతూ, తన పేరును నలుగురికి తెలియజేయాలి అనే ఆలోచనతో కాస్తో కూస్తో ఖర్చు పెడుతున్న, దాని వెనక స్వార్థం కోరలు తెంచుకొని, కట్టలు దాటి ఏరులై పారుతుంది.

Read More Telangana I ఒక కవితా సంకలనం కౌమార భావోద్వేగాల లోతుల్లోకి వెళుతుంది

ఇప్పుడు అన్ని చిన్న కుటుంబాలే. అమ్మానాన్న వారికి ఇద్దరు పిల్లలు అదే మా లోకం. అన్నట్టు నవీన ఆధునిక సమాజం విషపు కోరలను బహిర్గీతంగానే విరజిమ్ముతూ విశృంఖల నియంతృత్వాన్ని స్వార్థ భూతాన్ని నిలువునా కంఠంలో విషాన్ని దాచుకొని తెల్ల బట్టలు ధరించుకొని పెద్దమనుషుల పేరుతో చెలామనవుతున్నారు. ఇక రాజకీయం అంటే నాయకులంటే చెప్ప తరమే కాదు... నాయకులు తెల్ల బట్టలు ఎందుకేస్తారో తెలియని సమాజంలో ఇంకా మనం ఉన్నందుకు సిగ్గుపడాలి. శాంతి సహనానికి ప్రేమకి ప్రజలకు సేవ చేసే సేవా గుణాన్ని తెలియజేసే ఒక గుర్తుగా నాయకులు తెల్లబట్టలను ధరిస్తారు. కానీ దీనికి విరుద్ధంగా నేటి రాజకీయంలో రాజకీయ వ్యభిచారం చేస్తున్న వాళ్లు ఎంతో మందిని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు రాజకీయం ఇలా ఉంటే...  ఇదే రాజకీయం ఇప్పుడు ప్రతి కుటుంబంలో అగ్ని రగిలిస్తూ ప్రతి వారు రాజకీయం గురించి సోషల్ మీడియాలో తనకిష్టం వచ్చినట్టు రాస్తూ, కొందరు రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. మరికొందరు ఇదే సోషల్ మీడియాని రాక్షసంగా వాడుకుంటూ అమ్మాయిలను నగ్నంగా ఫోటో తీస్తూ కొందరు కాసులు దండుకోవడానికి ప్రయత్నిస్తుంటే మరికొందరు దుర్మార్గులు అమ్మాయిల మానప్రాణాలను లోబరుచుకోవాలని దుర్మార్గపు ఆలోచనలతో విషాన్ని చిమ్ముతున్నారు. మానవ సంబంధాల్లో కరెన్సీ చేరి మనిషి జీవితాన్ని కకా వికలం చేస్తుంది. కన్న పిల్లలను కన్న తల్లిదండ్రులను విడగొడుతూ తోబుట్టువుల మధ్య తగాదాలు పెడుతూ కరెన్సీ కాలకూట నాగుల మారి విషాన్ని చిమ్ముతుంది. ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లల ఆదరాభిమానాలను అందుకోలేక అనాధ శరణాలయాల్లో మగ్గుతున్నారు. దాన్ని చూసి మనందరం సిగ్గు లేకుండా తలవంచుకోవాల్సిందే. ఇంకోవైపు ఎంతో మంది పిల్లలు అనాధలుగా మిగిలి చౌర స్తాల్లో భిక్షాటన చేస్తూ కనిపిస్తున్నారు. ఆ పాపం నాది కాదులే అనుకొని నీవు నీ పనిలో ముందుకు సాగిన, ఈ సమాజం నిన్ను నన్ను దోషిని చేస్తూ ఆ పాపాన్ని పంచుకునేలా చేస్తుంది కాలం.. ఒకవైపు అనాధ శరణాలయాలు, ఇంకోవైపు ఆడపిల్ల అని తెలిసిన గర్భంలోనే మరణాలు, ఎక్కువగా సంభవిస్తున్నాయి.

Read More ఈరోజు కాకపోయినా రేపైనా నా డబ్బులు నాకు ఇచ్చేస్తారండి...

ఎవరో ఒక కవి అన్నట్టు రూపాయి రూపాయి నీ గుణం ఏంది అని అడిగితే.... అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతాను. భార్య భర్తల మధ్య దూరి ప్రేమను విడగొడతాను. అన్న చెల్లెల మధ్య బంధాన్ని దూరం చేస్తాను. అలాగే మనిషి మనిషికి మధ్య దూరం పెంచి కోపాన్ని పెంచుతాను... అంటూ గర్వంగా నాకు ఎన్నో రూపాలు ఉన్నాయి అవన్నీ మీరిచ్చినయే కదా అంటూ గర్వంగా తన విజయ సంకేతాన్ని చూపిస్తుందట రూపాయి... రూపాయి చేసే తప్పు అది మనం తప్పుగానే భావిస్తాం. కానీ రూపాయి చేసే ప్రతి పనిలో స్వచ్ఛమైన నిజాయితీ స్వార్థము కలిపి తన రూపాన్ని చూపిస్తుంది రూపాయి.

Read More దర్శకుడు నాగ్ అశ్విన్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు.. బుజ్జి ఏమన్నారంటే..

కాలం మారుతున్న కొద్ది మనుషులు మారాలండి ఇంకా ప్రేమలు అనుబంధాలు బంధాలు ఆప్యాయతలు ఇవి ఎక్కడున్నాయి నేనైతే చూడలేదు గత కొన్నేళ్లుగా  నా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే నా చిన్నతనం ఊహించుకుంటేనే చాలా కఠినంగా ఉంటుంది. భయమేస్తుంది. అని అనుకునే వారిలో నేను ఒకన్నే.... సమాజం కోసం యువత కోసం ఏదో చేయాలి ఏదో రాయాలి అనుకుంటూ అడుగులేసిన.. కానీ ఈ సమాజం నన్ను ఒక పిచ్చివానిగా మార్చేసింది.  

Read More Love : అమ్మను ప్రేమించలేనోడికి  అమ్మాయి కావాల్సొచ్చిందిరా?

నన్ను ఒక పేదవాని గానే మిగిలిచ్చింది... కానీ అక్షరాన్ని నమ్ముకున్నాను కాబట్టే ఇలా మీ అందరితో మాట్లాడగలుగుతున్నాను.. కాస్తో కూస్తో ఈ వ్యాసం చదివి ఆలోచిస్తారు. మనిషి గా మారి ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను.  మనమందరం మనుషులం జంతువులను కాదు.. కాలాలు మారిన తరాలు మారిన యుగాలు మారిన కాలం ఒడిలో మనమంతా పసిపాపలం. నోరులేని జీవాలు సైతం ప్రేమానురాగాలను చూపిస్తూ మనుషుల్ని ఆలోచింపజేస్తున్న మానవ యంత్రాలుగా జీవితాన్ని కొనసాగిస్తూ భాగ్య నగరాల్లో పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా మానవత్వాన్ని మరిచిపోయి భవ బంధాలను విడిచి కన్న ప్రేమలను వదులుకొని కన్నవారిని లెక్కచేయకుండా తిరిగే ఓ నా సమాజమా ఇకనైనా ఒక్కసారి ఆలోచించు నీ ప్రవర్తనను మార్చుకుంటావ్ అనుకుంటూ.... మనలోని మనీ అన్న మాటను కాస్త దూరం పెట్టి మానవత్వాన్ని ముందు నడిపించి, నేను మనిషిని నాలోను మానవత్వం ఉంది అని ఒక్కసారి కలిసి ఆచరణాత్మకంగా మన బాధ్యతలను నిర్వర్తించుదాం...

Read More Anand Mahindra : కోతుల గుంపు నుంచి శిశువును రక్షించిన యువతికి..

సర్వేజనా సుఖినోభవంతు.. సర్వేజనా సుజనో భవంతు... అన్న సూక్తిని మరొక మారు రుజువు చేద్దాం...

Read More నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

- కడారి శ్రీనివాస్ 
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత
గాయకులు, సామాజిక ఉద్యమకారులు

Read More నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

Latest News

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 

Social Links

Post Comment