Love : అమ్మను ప్రేమించలేనోడికి  అమ్మాయి కావాల్సొచ్చిందిరా?

"అది నా పాప రా! పదో క్లాసులోనే దాన్ని ప్రేమించానురా" అంటాడు బేబీ సినిమా లో హీరో !  హీరో కి ఒక గడ్డం ఫ్రెండ్ ఉన్నాడుగా ! వాడికే మాటలొస్తే ... 

Love : అమ్మను ప్రేమించలేనోడికి  అమ్మాయి కావాల్సొచ్చిందిరా?

"అది నా పాప రా! పదో క్లాసులోనే దాన్ని ప్రేమించానురా" అంటాడు బేబీ సినిమా లో హీరో !  హీరో కి ఒక గడ్డం ఫ్రెండ్ ఉన్నాడుగా ! వాడికే మాటలొస్తే... 
"నా పాప.. నా పాప అంటున్నావేందిరా! నీ తల్లి.. భర్త పోయాడు. మూగది. అయినా లోటు లేకుండా నిన్ను సాకింది. ఉన్నంతలో మంచి స్కూల్ లో సదివించింది . ఎందుకురా? నువ్వు బాగా చదివి ఉద్ధరిస్తావని. అరేయ్!  భర్త ను పోగొట్టుకొని ఒంటరిగా బతికే ఆడదాని బాధ నీకు తెలుసురా? ఎప్పుడైనా కొడుకు ప్రయోజకుడు అవుతాడని, చివరి రోజుల్లోనైనా తనని సుఖపెడుతాడని...  తానే.. తల్లిగా తండ్రిగా నిన్ను పెంచిందిరా ఆ మూగ తల్లి. ఆ తల్లిని ఎప్పుడైనా అర్థం చేసుకొన్నావురా? అమ్మను అర్థం చేసుకోలోనోడికి అమ్మాయి ఎందుకురా? ఆడదాన్ని అర్థం చేసుకోలేనోడికి ప్రేమ ఎందుకురా?

"పదో క్లాస్సులోనే హార్మోన్ ప్రేమ!  వ్యామోహం పెంచుకొన్నావు. దానికి దిక్కు లేని సమాజం పెట్టిన ముద్దు పేరు ప్రేమ. ఒరేయ్! ఏంట్రా ప్రేమ? తల్లిని ప్రేమించినావా? చదువును ప్రేమించినావా? వృత్తిని ప్రేమించినావా? ఆఖరికి నిన్ను నువ్వు ప్రేమించుకొన్నావా? " "ఇవన్నీ వద్దురా! పోనీ ఆ అమ్మాయిని ప్రేమించినావురా? ప్రేమ అంటే ఏంట్రా? నువ్వు పదో క్లాస్సులోనే కర్చీఫ్  వేసినావని... ఆ అమ్మాయి ఎలాంటి ఎదుగుదల లేకుండా జీవితాంతం ఉండిపోవాలారా? నువ్వు ముగ్గులోకి దించినా.. నీలా ఫెయిల్ కాలేదు. చదివింది. డొనేషనో.. ఇంకోటో...  మంచి ఇంజనీరింగ్ కాలేజీ లో సీట్ సాధించింది. తనకు అమ్మ బుద్ధి వచ్చింది. గొప్పింటి కుర్రాడు.. ఐ ఫోన్... కారు.. అన్నీ కనిపించేటప్పటికి బెస్ట్ ఫ్రెండ్ టాగ్ తో మభ్య పెట్టింది. తాగినోళ్లకు మనస్సులో ఉన్నదే బయటకొస్తుంది.  ఆ రోజు వాడి బర్త్డే పార్టీ లో తాగి వాడ్ని కిస్ చేసింది అంటే దానికి వాడి పై మనస్సుంది  అని. ఏదో సినిమాటిక్ గా చిక్కుల్లో ఇరుక్కుంది. లేకుంటే తాను తన ఇంజనీరింగ్ చదువు చదివుంటే. తనకు ఏ అమెరికా లోనో జాబ్ సంపాదించుంటే నువేం చేస్తావురా ? అమెరికా లో ఆటో తోలుతావా? లేదా ఫుట్ పాత్ పై అడుక్కొంటావా"

Read More అలియాబాద్ లో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

"ఆటో వాళ్ళు మనుషులు కారా? వారు ప్రేమించకూడదా? వారికి పెళ్ళాం పిల్లలు ఉండకూడదా? అని తొక్కలో  డైలాగు లొద్దు. వెదవ.. చీరేస్తా. ఒక రోజైనా ఆటో సరిగా తొలినావారా? దానితో సినిమాల కు షికార్లకు ఆటో ... ఆటో నే తాకట్టు పెట్టినావు... దానికి ఒక డొక్కు ఫోన్ కొనిపెట్టడానికి. అది రా నీ వృత్తిపై నీకున్న శ్రద్ధ...  భక్తి. పోనీ అప్పు తెచ్చినావు. వడ్డీలోడు  ఎన్ని సార్లు వార్నింగ్ ఇచ్చినా.. రేపు మాపు అంటావు కానీ  కట్టవు.. వారం రోజులు కస్టపడి మనసు పెట్టి ఆటో నడిపుంటే  పది వేలు సంపాదించుండేవాడివి కదరా. అప్పులో సగం కట్టి మిగతా దానికి ఇంకో 15 రోజులు గడువు అడిగి ఉండవచ్చు. లేదే. వాడి చేత చెంప దెబ్బలు తిన్న సిగ్గు లేని జన్మ  రా  నీది " " ఏంట్రా!  మూగది ..నీ లాంటి పీనుగని కనడం...  పెద్ద చెయ్యడమే... మీ అమ్మ చేసిన  తప్పా? నిన్ను ఎవడో కొడుతుంటే తానూ బాధతో ముందుకు వస్తే  నీ మొఖం చూడాలంటే నాకు అసహ్యం అంటావేంట్రా? నీకు చిన్నప్పుడే పాలలో ఉమ్మెత్త కలపి తాగించాల్సింది. అదే ఆమె చేసిన తప్పు... కన్న పేగురా.. కాయ కష్టం చేసి దాచుకొన్న డబ్బును..

Read More నిమజ్జన వేడుకల్లో భాగంగా లడ్డు వేలం పాట... ఘనంగా నిమజ్జన వేడుకలు

నువ్వు  నీ ప్రియురాలి మోజులో పడి...  దాని సొల్లు ఫోన్ కు నువ్వు చేసిన అప్పు తీర్చమని ఇస్తే...  నువ్వు చేసిందేంట్రా ? కన్న తల్లిని కసురుకోవడం. . మళ్ళీ దానికో కవరింగ్. విసిరి కొట్టిన డబ్బు తోనే కదా మల్లి నువ్వు అప్పు కట్టేది.. "ప్రేమించిన అమ్మాయికి సొంత డబ్బుతో ఒక సెల్ ఫోన్ కొనివ్వ లేవు. నీకు ప్రేమ కావాల్సి వచ్చిందిరా? పెళ్ళై..  పిల్లలు పుట్టుంటే వారిని ఏమి పెట్టి సాకుతావురా? ప్రేమించిన పాపానికి అమ్మాయి జీవితం ఎలాంటి ఎదుగు బొదుగూ లేకుండా నీ తోనే ఉండి పోవాలారా? బెంగళూరు  లాంటి చోట్ల సాఫ్ట్ వెర్ జాబ్ లో చేరుంటే.. నా మొగుడు ఆటో డ్రైవర్ .. వాడుకున్న ఒకే ఒక్క  క్యాలిఫికేషన్ పదో తరగతిలోనే చదువు ను కొండెక్కించి  నన్ను ప్రేమించడం అని చెప్పుకోవాలా?".

Read More లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ

ప్రతి ఉద్యోగానికి కనీస వయో పరిమితి..  కనీస విద్యార్హత ఉంటుంది. ప్రేమికుడి ఉద్యోగానికి ఉండదరా? అప్పుడే మెదడులో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ డెవలప్ కాదు. అంటే నీకే ఒక నిర్దిష్ట వ్యక్తిత్వం ఏర్పడదు. నువ్వెంటో నీకు తెలియని ఏజ్ లో...  ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాల్నో ఎలా డిసైడ్ చేస్తావురా? తనదీ నీ లాంటి ఇమ్మెచూరిటీ. పదో క్లాసులో స్కూల్... అసెంబ్లీ లో సైట్ కొడితే పడిపోయింది. అదేదో పెద్ద సాహసం అనుకొంది. అది ప్రేమ కాదురా. ఆక్సిటోసిన్ హార్మోన్ మాయ. కాస్త వయసు వచ్చేటప్పటికి తన తల్లి బుద్ధి  తనకు వచ్చింది. సుఖ పడితే తప్పు లేదురా.. బులబాటమ్ తీర్చుకొంటే తప్పు లేదురా ఆ పాత సినిమా దారిలో వెళ్ళింది.

Read More సెప్టెంబర్ 17న  ప్రజా పాలన దినోత్సవం

ఏమి చూసి ఆ అమ్మాయిని ప్రేమించావురా? తన వ్యక్తిత్వమా? అందమా? ప్రేమ కావాలి. కానీ ఎలాంటి అమ్మాయి నీకు సూట్ అవుతుందో తెలియదు." " అయినా సన్నాసీ .. నీది డొక్కు ఫోన్.. చూడు  ఐ ఫోన్.. పిక్చర్స్ ఎంత బాగున్నాయో.. ఈ డొక్కు ఫోన్ మా అమ్మకు  ఇస్తా. లేదా నువ్వే తీసుకో అన్నప్పుడే నీకు అర్థం కాలేదారా? అంతేలే... చదువు కొండెక్కిస్తే ఎలా అర్థం అవుతుందిరా?" "అది నీకు ఎన్నో హింట్ లు ఇచ్చింది . తన బుద్ధి బయట పెట్టుకొంది. ఒరేయ్ ఆటో వాడా అంది. తాను సుఖ పడాలని అనుకొనే సగటు అమ్మాయి మనస్తత్వం  తనది. తప్పారా? హ్యాండ్సమ్ కనిపిస్తే కనీసం మనసులో ఒక నిముషం అట్ట్రాక్ట్ కానీ అమ్మాయిలు ఎంత మంది వున్నారురా? అబ్బాయి లు స్కీమ్పీ డ్రెస్సులో వుండే హీరోయిన్ న చూసి సొంగ కార్చడం లేదా? చేస్తిటీ అనేది అమ్మాయిలకే ఉండాలా? అబ్బాయిలకు ఉండొద్దా?

Read More రాష్ట్ర ఉత్తమ ఆర్టీసీ డ్రైవర్ గా వీవీరెడ్డి

"అరేయ్ నువ్వు కొడుకుగా ఫెయిల్. స్టూడెంట్ గా ఫెయిల్. ఫ్రెండ్ గా ఫెయిల్. నేను దాని గురించి చెబుతుంటే నా పీక పై కత్తి పెడుతావురా? ఆటో డ్రైవర్ గా ఫెయిల్. చివరి సీన్ లలో ఆటో నడుపుతూ తాగుతావురా? పెర్మనెంట్ గా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చెయ్యాలి.  తల్లిని ప్రేమించలేనోడికి పిల్ల ఎందుకురా?.."  "పదో క్లాస్సులోనే ప్రేమించాను.. నా బేబ.. నా బేబీ.. అని పలవరించడం ఆపు. ఫెయిల్యూర్ కొడుకు సక్సెఫుల్ భర్త అవుతాడరా? రేయ్.. అమ్మాయిలకు అందం కేవలం ఇరవై ఏళ్ళు. నేటి మోడరన్ అమ్మాయికి తెలుసు... ఒక అబ్బాయి తన అందం చూసి ఆకర్షితుడు అవుతాడు అని. ఈ నాటి అమ్మాయిలు అయినా...  నాటి అమ్మాయిలు అయినా.. తన భర్త వద్ద నుంచి కోరుకొనేది జీవితానికి సెక్యూరిటీ. పుటిన దేశాన్నే వదిలి పెట్టి పోతున్నారు మంచి బతుకు తెరువు కోసమే.

Read More సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

పుట్టింట్లో పురుడు పోసుకోవడం ఇక్కడి సంప్రదాయం. తన బిడ్డకు ఆ దేశ పౌరసత్వం  కావాలని అక్కడే డెలివరీ చేసుకొంటున్నారు. భారత దేశం నా మాతృ భూమి అని స్కూల్ రోజుల్లో ప్రతి ఆరోజు...  ప్రతిజ్ఞ చేసిన వాళ్లే తాము వెళ్లిన దేశపు పౌరసత్వానికి తహలాడుతున్నారు. ఇదేదో నేరం కాదు.. ఘోరం కాదు. బ్రతుకు పోరాటం. మెరుగైన జీవనం కోసం ప్రయత్నం. తాము కష్టపడినా... తమ పిల్లలు సుఖ పడాలని ఆశ. ఇది రా లోకం. పదో క్లాస్సులోనే ప్రేమించాను. ఇగ ఆ ప్రేమకు ఆమె జీవితాంతం కట్టుబడి ఉండాలి.. లేక పొతే చస్తాను అని తెగ తాగుతున్నావు...  చావురా. భూమికి భారం తగ్గుతుంది. నిన్ను కన్న ఆ తల్లి మూగది. లేక పొతే ఏ తల్లీ కనకూడదు.. ఇలాంటి కొడుకును.. పాత సినిమా పాత పాడుండేది. ఇప్పటికైనా మించి పోయింది లేదు. నిన్ను ఒక మంచి కౌన్సెలర్ దగ్గరకు తీసుకొని వెళుతాను"  అదండీ సినిమా కు నా  అదనపు డైలాగ్ లు. ఇప్పుడు హీరో రిప్లై ఎలా ఉంటుందో.. మీరు పోస్ట్ చెయ్యొచ్చు. తప్పు లేదు.

Read More రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్‌ మను సింఘ్వీ ఏకగ్రీవ ఎన్నిక

- రఘునాద్ గౌడ్

Read More ప్రభుత్వ  ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించిన డి సి హెచ్ మాతృ నాయక్ 

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన