రాష్ట్ర ఉత్తమ ఆర్టీసీ డ్రైవర్ గా వీవీరెడ్డి

రాష్ట్ర ఉత్తమ ఆర్టీసీ డ్రైవర్ గా వీవీరెడ్డి

 దేవరకొండ ..... దేవరకొండ ఆర్టీసీ డిపోకు చెందిన టిమ్ డ్రైవర్ వడ్డపల్లి వెంకట్ రెడ్డి(వి.వి రెడ్డి)కి "ప్రగతిచక్రం" అవార్డులలో భాగంగా రాష్ట్ర ఉత్తమ డ్రైవర్ అవార్డు లభించిందని డిపో మేనేజర్ తల్లాడ రమేష్ బాబు తెలిపారు.

ఈ మేరకు శనివారం హైదరాబాద్ బస్సు భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేతుల మీదుగా అవార్డు, రూ. 51వేలు రివార్డు అందుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రైవేట్ హైర్ బస్సు డ్రైవర్ ఆర్.నెహ్రుకు రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్ తో అవార్డు లభించిందని తెలిపారు. దేవరకొండ డిపోకు రెండు ఉత్తమ రాష్ట్ర స్థాయి అవార్డులు రావడం సంతోషకరమని డీఎం రమేష్ బాబు అన్నారు. ఈ సందర్బంగా డీఎం వారికి అభినందనలు తెలిపారు. డిపో ఉద్యోగులు, సహచరులు హర్షం వ్యక్తం చేశారు.

Read More రైతుబంధును బంజేసే కుట్ర: హరీశ్ రావు..!!