గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల పట్ల మక్కువ చూపాలి - సీఐ శ్రీనాథ్

ఈ నెల 26న పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు

పోటీల్లో యువత పాల్గొనాలని సీఐ సూచన

గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల పట్ల మక్కువ చూపాలి - సీఐ శ్రీనాథ్

జయభేరి, ఆగస్టు 24:- గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల పట్ల మక్కువ చూపాలని శామీర్ పేట్ సీఐ శ్రీనాథ్ సూచించారు.

ఈ నెల 26న మజీద్ పూర్ లోని జైన్ హెరిటేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ మైదానంలో పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పోలీసులకు, ప్రజలకు మధ్య స్నేహపూర్వక వాతావరణం కలిగించాలనే ఉద్దేశ్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Read More దేవరకొండ మునిసిపాలిటీ బిజెపి అధ్యక్షులుగా వస్కుల సుధాకర్ నియామకం

అదేవిదంగా ఈ పోటీల ద్వారా యువతలో క్రీడా నైపుణ్యం పెంపొందుతుందని వెల్లడించారు. శామీర్ పేట్ మండల పరిధిలోని 18 సంవత్సరాలు నిండిన గ్రామాల యువత ఈ పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని సీఐ కోరారు .

Read More శాయంపేట బిజేపి మండల అధ్యక్షునిగా నరహరిశెట్టి రామకృష్ణ