రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్‌ మను సింఘ్వీ ఏకగ్రీవ ఎన్నిక

రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్‌ మను సింఘ్వీ ఏకగ్రీవ ఎన్నిక

హైదరాబాద్‌, ఆగస్టు 27 : తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్‌ నుంచి అభిషేక్‌ మను సింఘ్వీ, ఇండిపెండెంట్‌గా పద్మరాజన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

అయితే ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేసిన పద్మరాజన్‌ను ఎమ్మెల్యేలు బలపరచకపోవడంతో ఆయన నామినేషన్‌ తిర స్కరణకు గురైంది. దీంతో రాజ్యసభ సభ్యుడిగా సిం ఘ్వీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆయన తరఫున కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరం జన్‌ ఎన్నికల అధికారి నుంచి ధ్రువీకరణపత్రం తీసుకోనున్నారు.అభిషేక్‌ సింఘ్వీ సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందిస్తున్నారు. 

Read More తెలంగాణ భవన్లో ఘనంగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు

2001 నుంచి కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి  గా పనిచేస్తున్నారు. రెండు దఫాలు (2006, 2018)గా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి పోటీచేసి భాజపా చేతిలో ఓడిపోయారు. 

Read More మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సాయి గౌడ్

తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యత్వం కోసం స్థానిక నాయకులు కొందరు ప్రయత్నించినా… జాతీయ రాజకీయాల్లో సింఘ్వీ సేవ లు కాంగ్రెస్‌కు కీలకమైనం  దున ఆయనకే అధిష్ఠానం అవకాశం కల్పించింది.

Read More ఈనెల 25న జరిగే రవీంద్ర భారతిలో బీసీల సమరభేరిని విజయవంతం చేయండి