ప్రభుత్వ  ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించిన డి సి హెచ్ మాతృ నాయక్ 

ప్రభుత్వ  ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించిన డి సి హెచ్ మాతృ నాయక్ 

దేవరకొండ....  ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో స్వచ్ఛత, పరిశుభ్రత పాటించాలని, వైద్య సేవల కొరకు నమ్మకంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని, ప్రభుత్వ దవాఖానాలో ప్రసవాలా సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని నల్గొండ డి సి హెచ్  మాతృ నాయక్   తెలిపారు. బుధవారం దేవరకొండ ఏరియ ఆసుపత్రికి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు.హాస్పిటల్ ఆవరణలో స్వచ్ఛత, పరిశుభ్రత పాటించాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా పై ప్రత్యేక దృష్టి పెట్టి, టెస్టులు నిర్వహించి మందులు అందించాలని సూచించారు. 24 గంటలు అనస్తేషియా ఉండేటట్లు చర్యలు తీసుకుంటానని అన్నారు. వైద్య సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Read More ఏఐసీసీ నేతలను కలిసిన బండారు శ్రీకాంత్ రావు ...

IMG-20240828-WA1673

Read More మెడిసిటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఉండాలని అన్నారు. ఆస్పత్రిలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీధితోపాటు ఇంచార్జ్ సూపరిడెంట్ మంగ్త నాయక్, డాక్టర్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు.

Read More ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎన్నిక