కోలుకున్న క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగి

కేర్ ఆస్పత్రి వైద్యుల ఘనత

ప్రవాస భారతీయునికి కేర్ ఆస్పత్రి వైద్యులు అవసరమైన శస్త్ర చికిత్సలు నిర్వహించి, మూడు నెలల పాటు శ్రమించి రోగిని ఆరోగ్యవంతుడిని చేశారు.

కోలుకున్న క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగి

తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగి అద్భుతమైన రీతిలో ఆరోగ్యవంతుడయ్యాడు. క్లిష్టమైన హృద్రోగ సమస్యతో పాటు శరీరంలోని పలు అవయవాల ఆరోగ్యం నవిషమించిన స్థితిలో బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చేరిన ప్రవాస భారతీయునికి ఆస్పత్రి వైద్యులు అవసరమైన శస్త్ర చికిత్సలు నిర్వహించి, మూడు నెలల పాటు శ్రమించి రోగిని ఆరోగ్యవంతుడిని చేశారు.

భారత సంతతికి చెందిన భాస్కర్ పొనుగంటి (43) ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. ఇతను కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శ్వాస ఆడక పోవడంతో పాటు తీవ్రమైన హృద్రోగ సమస్యతో దాదాపు మూడు నెలల క్రితం బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో భాస్కర్ చేరారు. రోగికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆ రోగి బృహద్దమని కవాటానికి సంబంధించిన "ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్" వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల రోగికి మూత్రపిండాల వైఫల్యం, ఎడమవైపు పక్షవాతం కలిగించే మెదడు పోటు బ్రెయిన్ స్ట్రోక్ కలిగి రోగి ఆరోగ్యం క్షీణించింది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న ఆ రోగి వెంటిలేటర్ పై ఉన్నప్పటికీ.. అతని బృహద్ధమని కవాటానికి అత్యవసర శస్త్ర చికిత్స చేయడమే సరైన మార్గమని ఆస్పత్రి క్లినికల్ డైరెక్టర్, కార్డియాలజీ విభాగాధిపతి డా. వి.సూర్యప్రకాశరావు నేతృత్వంలోని వైద్య బృందం నిర్ధారించింది. 

Read More ఉర్దూ భాషా ప్రచారం ను వేగవంతం చేయాలి, భావి తరాలకు రోజు రెండు గంటలు బోధించాలి...

క్లిష్టమైన శస్త్ర చికిత్సను (హై రిస్క్ సర్జరీ) నిర్వహించేందుకు రోగి కుటుంబ సభ్యులు అనుమతించిన అనంతరం ఆస్పత్రికి చెందిన సీనియర్ కార్డియోథొరాసిక్, హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డా. నగేష్ ఆధ్వర్యంలో వైద్య బృందం "మెకానికల్ వాల్వ్" వైద్యవిధానం ద్వారా రోగి బృహద్దమని కవాట మార్పిడిని విజయవంతంగా నిర్వహించింది. దీంతో రోగి ఆరోగ్యం కుదుటపడింది. అనంతరం రోగికి అవసరమైన మరో శస్త్ర చికిత్స నిర్వహించిన తరువాత రోగి అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. దీంతో అతని ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ క్రమంలో రోగిని మెడికల్ ఐసీయూలో ఉంచి.. ఆస్పత్రి అసోసియేట్ క్లినికల్ డైరెక్టర్, క్రిటికల్ కేర్ విభాగాధిపతి డా. జి.భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో అవసరమైన వైద్య సాయం అందించారు. న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఇంటెన్సివిటీ, కార్డియాక్ విభాగాలు.. సమన్వయంతో నిరంతర పర్యవేక్షణలో కఠినమైన ఫిజియోథెరపీతో కూడిన బహుళ వైద్య చికిత్స విధానాలను రోగికి అందించాయి.

Read More హైడ్రా లాంటి సంస్థలతోనే విపత్తుకు విముక్తి

ఈ నేపథ్యంలో దాదాపు రెండు వారాల అనంతరం రోగి ఆరోగ్యం నిలకడగా ఉండి, అతను క్రమంగా కోలుకోవడం ప్రారంభించారు. అనంతరం రోగిని దాదాపు రెండు నెలల పాటు ఐసీయూలోనే ఉంచి అవసరమయ్యే వైద్యసహాయం అందించడంతో అతను పూర్తిగా కోలుకున్నారు. దాదాపు 75 రోజుల తర్వాత రోగి పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా కేర్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. అజిత్ సింగ్ మాట్లాడుతూ... డిశ్చార్జ్ అయిన రోగి భాస్కర్ మరలా వైద్య పరీక్షల కోసం ఇటీవల కేర్ ఆస్పత్రికి వచ్చారని, అతని ఆరోగ్య పరిస్థితి పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపారు. 

Read More కష్టంలో తోడుగా.. కన్నీళ్లలో అండగా…

ఆసుపత్రి సి ఓ ఓ సయ్యద్ కమ్రాన్ మాట్లాడుతూ... అసాధారణమైన రీతిలో రోగి కోలుకోవడం సంతోషంగా ఉందన్నారు. వివిధ వైద్య విభాగాలు సమన్వయంతో సంక్లిష్టమైన వైద్య విధానాల ద్వారా రోగికి అందించిన వైద్య సాయం అతని ప్రాణాలను నిలబెట్టిందని అభిప్రాయపడ్డారు. వైద్య బృందం ఘనతను ప్రశంసించారు. రోగులకు అవసరమైన వైద్యసహాయం అందించేందుకు తమ ఆస్పత్రి ఎల్లప్పుడూ అంకితభావం కలిగి ఉంటుందన్నారు. అధునాతన వైద్య సంరక్షణతో ఏం సాధించవచ్చో ఈ కేసు ద్వారా వైద్య బృందం నిరూపించిందన్నారు. రోగి కోలుకోవడం అద్భుతమని వ్యాఖ్యానించారు.

Read More హోరాహోరీగా సాగిన లడ్డు వేలం పాట

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన