Thirupathi : తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

  • శ్రీరామనవమి రోజున స్వామి వారికి కల్యాణ వేడుక అన్ని ఆలయాల్లో జరుగుతుంది. అయితే, ఒంటిమిట్టలో మాత్రం నవమి తర్వాత చతుర్దశి రోజున కల్యాణం నిర్వహిస్తారు.

Thirupathi : తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుపతి, ఏప్రిల్ 22 :
తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద నామాలు జపిస్తూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ, భూదేవి కరుణతో, సమస్త ధాన్యాలూ, శ్రీవారి కరుణా కటాక్షాలతో సర్వ శుభాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా, వసంత రుతువులో మలయప్ప స్వామికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు.

Vontimitta-Brahmotsavam-Ambati-Rambabu-Andhra-Pradesh-sita

Read More శ్రీ గౌరీ అవతారంలో అమ్మవారు 

మరోవైపు, ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. సాయంత్రం 6:30 నుంచి ప్రారంభం కానున్న కల్యాణం వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందు తలెత్తకుండా ఇప్పటికే టీటీడీ, జిల్లా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు అన్న ప్రసాదం, తాగునీరు, మజ్జిగ అందించనున్నారు. వేసవి దృష్ట్యా గ్యాలరీల్లో ఎయిర్ కూలర్లు, స్వామి వారి కల్యాణం వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికీ ముత్యాల తలంబ్రాలు, తిరుమల నుంచి తెప్పించిన చిన్న లడ్డూలు పంపిణీ చేయనున్నారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఈసారి దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్ హాజరై పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కాగా, శ్రీరామనవమి రోజున స్వామి వారికి కల్యాణ వేడుక అన్ని ఆలయాల్లో జరుగుతుంది. అయితే, ఒంటిమిట్టలో మాత్రం నవమి తర్వాత చతుర్దశి రోజున కల్యాణం నిర్వహిస్తారు.

Read More అలియాబాద్ లో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

అటు, తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) ఈసారి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. 2023 - 24 ఏడాదికి గాను రూ.1,161 కోట్లు, 1,031 కేజీల బంగారం శ్రీవారి హుండీ ద్వారా వచ్చినట్లు అధికారులు తెలిపారు. తాజాగా టీటీడీ ఈ మొత్తాన్ని డిపాజిట్‌ చేసింది. రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం గత ఐదేళ్లలో గణనీయంగా పెరుగుతూ వచ్చిందని వెల్లడించారు. తాజాగా రూ.1,161 కోట్లు, 1,031 కేజీల బంగారాన్ని టీటీడీ డిపాజిట్‌ చేయడంతో మొత్తంగా రూ.18 వేల కోట్లకు దేవస్థాన డిపాజిట్లు చేరుకున్నాయని అన్నారు. ప్రస్తుతం ఏటా లభించే వడ్డీ రూ.1,200 కోట్లు దాటింది. కాగా, 2018 నాటికి ఏటా లభించే వడ్డీ రూ.750 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో ఐదేళ్ల  కాలంలో వడ్డీ దాదాపుగా రూ.500 కోట్లు ఎక్కువకు చేరుకుంది. మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనానికి కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Read More రోజుకు 2.14 లక్షల మందికి అన్నదానం

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు

Social Links

Post Comment