TTD : ధ్వజారోహణంతో వైభ‌వంగా శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీ గోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఈ ఊరేగింపు ద్వారా స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అర్చకులు విష్వక్సేన ఆరాధన, గరుడ లింగహోమం, వాస్తుహోమం, గరుడ ప్రతిష్ట , రక్షా బంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు.

TTD : ధ్వజారోహణంతో వైభ‌వంగా శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

జయభేరి, తిరుపతి :
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం 8.15 నుండి 8.40 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీవారి ఆస్థానం ఘనంగా జరిగింది.

అంతకుముందు శ్రీ గోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్‌, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఈ ఊరేగింపు ద్వారా స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అర్చకులు విష్వక్సేన ఆరాధన, గరుడ లింగహోమం, వాస్తుహోమం, గరుడ ప్రతిష్ట , రక్షా బంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ధ్వజారోహణం ఉద్దేశం.

Read More వర్గల్ క్షేత్రాన్ని... తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామి గా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం

అనంత‌రం ఉద‌యం 10.30 గంట‌లకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఉత్స‌వ‌ర్ల‌కు వైభ‌వంగా స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేశారు. ఊంజ‌ల్ సేవ‌ సాయంత్రం 5.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు, పెద్దశేష వాహ‌న సేవ రాత్రి 7 గంట‌ల‌కు జ‌రుగ‌నున్నాయి.

Read More శ్రీ గౌరీ అవతారంలో అమ్మవారు 

100 (2)

Read More నేత్రపర్వం నాచగిరి క్షేత్రం...

ఈ కార్యక్రమంలో తిరుమ‌ల‌ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఎఫ్ ఏ అండ్ సిఏఓ  బాలాజీ, సిఈ  నాగేశ్వరరావు, ఎస్ ఇ -2 జగదీశ్వర్ రెడ్డి, ఆగమ సలహాదారులు  సీతారామాచార్యులు, మోహన రంగాచార్యులు, ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, కంకణభట్టార్‌  ఎ.నారాయణ దీక్షితులు, సూపరింటెండెంట్‌ మోహన రావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌  ధనుంజయులు పాల్గొన్నారు.

Read More Rashi Palalu : నేటి రాశి ఫలాలు

Latest News

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్...
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు

Social Links

Post Comment