ప్రముఖ నటి రాజకీయ నేత దారుణ హత్య
ప్రముఖ నటి, రాజకీయ నేత హత్యకు గురయ్యింది. కన్నడ సహాయ నటి విద్యా హత్యకు గురి కావడం... సినీ పరిశ్రమతో పాటు రాజకీయంగా కూడా చర్చ నడుస్తోంది.
ప్రముఖ నటి దారుణ హత్యకు గురైంది. సోమవారం కన్నడ సహాయ నటి విద్యా నందీష్ హత్య చేశారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘భజరంగీ’ (Bajarangi)లో విద్యా (Vidya) నటించింది. కొన్ని కన్నడ సినిమాల్లో సహాయ నటిగా నటించింది. ఈ ఘనట బన్నూర్ పోలీస్ స్టేషన్ మైసూర్ జిల్లా పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మైసూర్ సిటీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ విద్యా నందీష్ హత్యకు గురి కావడం కన్నడ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతుంది. విద్యను ఆమె భర్త నందీషే హత్య చేసినట్లు తేలింది. విద్యా చిరంజీవి సర్జా నటించిన ‘అజిత్’ సినిమాలో హీరో స్నేహితురాలిగా నటించింది విద్య.
విద్య (vidya)కు బన్నూరు సమీపంలోని తురగనూరుకు చెందిన సామాజిక కార్యకర్త నందీష్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా, విద్యానందీష్ తన భర్త, పిల్లలతో కలిసి మైసూర్‌లోని శ్రీరాంపూర్‌లో నివాసం ఉంటోంది. ఇటీవల విద్య కాంగ్రెస్ పార్టీలో చేరింది. అప్పటి నుండి పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉంటుంది ఆమె. అయితే ఇటీవల భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పార్టీలో కొంత మంది నేతలతో సన్నిహితంగా మెలుగుతుందని, అది భర్త తట్టుకోలేకపోతున్నాడని సమాచారం. ఈ విషయంపైనే భార్యా భర్తల మధ్య గొడవలు జరిగి.. హత్యకు దారి తీసిందని స్థానికంగా చర్చనడుస్తోంది. గొడవ సోమవారం రాత్రి జరగ్గా.. పదునైన ఆయుధంతో భార్య తలపై కొట్టి పారిపోయాడు నందీష్.
రక్తపు మడుగుల్లో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని మంగళవారం ఉదయం చూసి పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు హత్య గురికావడంతో అటు పొలిటికల్, ఇటు ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. నిందితుడు నందీష్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. విద్యా భజరంగీతో పాటు వజ్రకాయ అనే సినిమాల్లో కూడా నటించింది. పార్టీలో జనరల్ సెక్రటరీ స్థాయికి వెళ్లిన విద్య.. అంతలోనే ఆమె హత్యకు గురైంది. కాంగ్రెస్ నేతలు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Post Comment