Priyamani : ప్రియమణి తొలి రెమ్యూనరేషన్ అంతకన్నా తక్కువే.. తొలి రెమ్యూనరేషన్ ఇంకా దాచుకున్న హీరోయిన్..

ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ప్రియమణి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోకి అడుగుపెడుతోంది.

Priyamani : ప్రియమణి తొలి రెమ్యూనరేషన్ అంతకన్నా తక్కువే.. తొలి రెమ్యూనరేషన్ ఇంకా దాచుకున్న హీరోయిన్..

2003లో అతగాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత జగపతి బాబు నటించిన పెళ్లాయన కొత్తలో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తమిళ చిత్రం పరుత్తివీరన్‌లో కార్తీ సరసన కథానాయికగా నటించింది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను ప్రియమణికి జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది.

ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ప్రియమణి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోకి అడుగుపెడుతోంది. ఆమె హిందీ, తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ చిత్రాలలో చాలా సినిమాలు చేసింది. 2003లో అతగాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత జగపతి బాబు నటించిన పెళ్లాయన కొత్తలో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తమిళ చిత్రం పరుత్తివీరన్‌లో కార్తీ సరసన కథానాయికగా నటించింది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను ప్రియమణికి జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది. దీంతో కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసింది. అయితే పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.

Read More anupama parameswar : ఒకప్పుడు తెలుగు సంప్రదాయ హీరోయిన్..

priyamani01042021m2

Read More 1000 కోట్ల మైల్ స్టోన్ చేరుకున్న కల్కి 2898 AD  

ప్రియమణి అసలు పేరు ప్రియా వాసుదేవ్ మణి అయ్యర్. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అంత పెద్ద పేరు షార్ట్ కట్ తీసుకుంది. ప్రియమణి 2017లో ముస్తఫా రాజాను వివాహం చేసుకుంది. నటి ప్రియమణి ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన మొదటి జీతం గురించి చెప్పింది. ప్రస్తుతం ప్రియమణి కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నా మొదటి వేతనం రూ. 500 మాత్రమే. మొదటి వేతనంగా తీసుకున్న రూ.500 ఇప్పటికీ చాలా భద్రంగా ఉంచుకున్నానని చెప్పింది. తన అద్భుతమైన నటనతో అభిమానుల మనసు దోచుకున్న ప్రియమణి.. సినిమాలో మేకప్ లేకుండా నటించాలని ఉందని అన్నారు.

Read More ఘనంగా రాజ్ తరుణ్ "పురుషోత్తముడు" మూవీ టీజర్ లాంఛ్

83484063527894

Read More పద్మవిభూషణ్ చిరంజీవికి అభినందల వెల్లువ..!

ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రియమణి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రియమణి షారుక్‌తో కలిసి జవాన్‌ సినిమాలో కనిపించింది. ఆర్టికల్ 370 సినిమాలో కూడా ప్రియమణి కీలక పాత్ర పోషించింది.సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ మంచి రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రియమణి తాజాగా ఓ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఆమె కొనుగోలు చేసిన Mercedes Benz GLC కారు ధర 90.15 లక్షల నుండి 1 కోటి వరకు ఉంటుంది. ఆమె తన కొత్త కారు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

Read More 'డార్లింగ్' లో నా డ్రీమ్ రోల్ చేశాను.

Social Links

Related Posts

Post Comment