నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా 

నల్లగొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా 

జయభేరి, నల్లగొండ :
నల్గొండ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నా విజయవంతమైంది. ఈ మహాధర్నాకు ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కేటీఆర్‌ గారికి ఘన స్వాగతం పలికి ర్యాలీగా క్లాక్ టవర్‌ వరకు  తీసుకెళ్లిన రైతులు.

WhatsApp Image 2025-01-28 at 21.09.50

Read More పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం

కేటీఆర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు:
నల్లగొండ పోరాటాల గడ్డ. పోరాటానికి స్పూర్తి ఇచ్చిన ఈ ప్రాంతానికి వందనం.
కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బ్రహ్మాండంగా వసతులుండేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కష్టాలు ఎక్కువయ్యాయి.
పోరాటాల పురిటి గడ్డ నల్లగొండ మళ్లీ రాష్ట్రంలో రైతుల తిరుగుబాటుకు వేదిక కావాలి.
కేసీఆర్ పాలనలో టింగ్‌ టింగ్‌ మని డబ్బులు ఖాతాలో పడేవి. ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు.
కేసీఆర్‌ 2 పంటలకే ఇస్తుండు.. కానీ రేవంత్‌రెడ్డి మూడో పంటకు ఇస్తా అని మోసం చేస్తున్నాడు.
జనవరి 26న రాత్రి 12 గంటలకు డబ్బులు వేస్తామని అన్నడు రేవంత్ రెడ్డి..  కానీ ఇప్పటివరకు రూపాయి పడలేదు.
రుణమాఫీ, రైతుబంధు, బోనస్ అన్నీ బోగస్ అని పేర్కొన్నారు.
నల్లగొండ బిడ్డలు జీవశ్చవాలుగా మారడానికి కాంగ్రెస్సే  కారణం.
కాంగ్రెస్ ప్రభుత్వం 2023 యాసంగి పంటకు రైతు భరోసా 2,500 బాకీ పెట్టిందని, వానాకాలం ఒక్కో ఎకరానికి 7,500 బాకీ పడ్డది.
ఒక్కో రైతుకు ఎకరాకు రూ.17,500 బాకీ ఉన్నది. కాంగ్రెస్ రైతులను నిలువునా మోసం చేసింది.
రైతుబంధు డబ్బులు ఆపడానికి రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారు.
మార్చి 31 వరకూ రుణమాఫీ కొనసాగుతుందని చెబుతున్నారు కానీ ఏ సంవత్సరమో చెప్పడం లేదు.
నల్లగొండ నుంచి కాంగ్రెస్ వ్యతిరేక పోరాటం ప్రారంభం.
కాంగ్రెసోళ్లు మళ్లీ ఓట్ల కోసం వస్తారు. నిలదీయండి.
నల్లగొండ నుండే కాంగ్రెస్‌ను చీల్చి చెండాడాలి.
హైకోర్టు ధర్నాకు అనుమతిచ్చినందుకు ధన్యవాదాలు.
మా పోరాటం న్యాయంగా కొనసాగుతుంది. న్యాయం ఇంకా బ్రతికే ఉంది.

Read More చింతపల్లిలో రెండు రోజులపాటు జరిగిన బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు

Latest News

బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కోఆర్డినేటర్ గా గోర శ్యాంసుందర్ గౌడ్. బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కోఆర్డినేటర్ గా గోర శ్యాంసుందర్ గౌడ్.
తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా బీసీ ఇంటలెక్షన్ ఫోరం కోఆర్డినేటర్లను నియమిస్తుంది ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్గా ఎల్బీనగర్కు చెందిన...
దండోరా దళపతి పాట ఆవిష్కరించిన మందకృష్ణ మాదిగ
పదవి ఉన్న లేకున్నా కార్యకర్తలకు అండగా నిలబడతా
మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులో అభినందన సభ
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం
ప్రతాప్ రెడ్డికి అందజేసిన నూతన క్యాలెండర్