48 గంటల్లో ఆపరేషన్ కంబోడియా..

మానవ అక్రమ రవాణా కోణాన్ని వెలికి తీశారు. కంబోడియా మాఫియా నుంచి తప్పించుకుని వచ్చిన వ్యక్తి ఫిర్యాదుతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేయగా.. సీపీ రవిశంకర్‌ అయ్యనార్‌ స్పెషల్‌ ఫోకస్‌తో బండారం బట్టబయలైంది. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లి యువత మోసపోయినట్లు తేల్చారు సీపీ అయ్యనార్‌.

48 గంటల్లో ఆపరేషన్ కంబోడియా..

జయభేరి, విశాఖపట్టణం,  మే 25 :
సైబర్‌ క్రైమ్‌ కేటుగాళ్లు రోజుకో రూటులో నేరాలు చేస్తూ రెచ్చిపోతూనే ఉన్నారు. రూట్‌ చేంజ్‌ అంటూ.. ఇప్పుడు కొత్త పంథా ఎంచుకున్నారు. 

ఉద్యోగాల పేరుతో భారతీయులను వాళ్ల దేశాలకు తీసుకెళ్లి.. మన కంటిని మన వేళ్లతోనే పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. అవును.. సరిగ్గా ఇలాంటి కేసే విశాఖలో వెలుగులోకి వచ్చింది. కాంబోడియాలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు విశాఖ పోలీసులు. ఒక వ్యక్తి ఫిర్యాదుతో కంబోడియా గ్యాంగ్‌ డొంకనే పెకిలించారు విశాఖ సీపీ రవిశంకర్‌ అయ్యనార్‌. ఈ కేసులో దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ బాగోతాన్ని గుర్తించడమే కాదు.. 

Read More జగన్ కు ఆర్ ఆర్ ఆర్ ఉచ్చు

మానవ అక్రమ రవాణా కోణాన్ని వెలికి తీశారు. కంబోడియా మాఫియా నుంచి తప్పించుకుని వచ్చిన వ్యక్తి ఫిర్యాదుతో విశాఖ పోలీసులు కేసు నమోదు చేయగా.. సీపీ రవిశంకర్‌ అయ్యనార్‌ స్పెషల్‌ ఫోకస్‌తో బండారం బట్టబయలైంది. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లి యువత మోసపోయినట్లు తేల్చారు సీపీ అయ్యనార్‌. ఆ వెంటనే.. భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి.. కంబోడియా కేటుగాళ్ల చేతుల్లో చిక్కుకున్న బాధితులకు విముక్తి కల్పించారు. సీపీ రవిశంకర్‌ అయ్యనార్‌ ప్రత్యేక చొరవతో ఎట్టకేలకు కంబోడియా బాధితులు విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక బ్యానర్‌ ప్రదర్శిస్తూ స్వాగతం పలికి అక్కున చేర్చుకున్నారు పోలీసులు. 

Read More వాటాలిస్తారా..? వ్యాపారం వదిలేస్తారా..?

ఇక.. ఈ కేసులో ఇప్పటికే విశాఖకు చెందిన ముగ్గురు ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా వివరాలు, వారి మోసాలపై CP రవిశంకర్‌ అయ్యానార్‌ దృష్టి సారించారు. కొందరు విశాఖ ఏజెంట్లు.. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో 150 మంది నిరుద్యోగులను పంపడంతో కాంబోడియా గ్యాంగ్‌ నిర్బంధించినట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లిన తర్వాత భారతీయుల వీసాలు చించివేయడంతో ఆ కేటుగాళ్ల ఉచ్చులో పడుతున్నారని.. ఇలా.. దేశవ్యాప్తంగా కంబోడియా గ్యాంగ్‌ చేతిలో సుమారు 5వేల మంది చిక్కుకున్నట్లు దర్యాప్తులో తేలడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అన్ని రకాల లాంగ్వేజ్‌లు మాట్లాడేలా.. వివిధ రాష్ట్రాల వారిని తీసుకెళ్లి నిర్బంధించినట్లు వెల్లడైంది. అంతేకాదు.. మనవాళ్లకు పలు రకాల స్కామ్‌ల్లో ట్రైనింగ్‌ ఇచ్చి.. మనదేశంపైనే సైబర్‌ ఎటాక్‌ చేయిస్తుండడం సంచలనంగా మారింది.

Read More పేరుకే ప్రభుత్వ అస్పత్రి.. పైన పటారం లోన లొటారం

cambodia-victims-return-home-1

Read More రాజ్యసభలోకి టీడీపీ రీ ఎంట్రీ

ఇక.. కంబోడియా గ్యాంగ్‌ మన వాళ్లను అక్కడికి ఎలా తీసుకెళ్తున్నారు?.. మనవాళ్లతో సైబర్‌ నేరాలు ఎలా చేయిస్తున్నారు? ఆ గ్యాంగ్‌ గుట్టు ఎలా రట్టు చేశారు?.. అనే కీలక విషయాలను వెల్లడించారు విశాఖ సీపీ రవిశంకర్‌ అయ్యనార్‌. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో విశాఖ ఏజెంట్లు నిరుద్యోగులను కంబోడియా ఏజెంట్లకు అమ్మేస్తున్నారన్నారు. ఇలా చేయడం ద్వారా విశాఖ ఏజెంట్లకు కంబోడియా గ్యాంగ్‌ ఒక్కొక్కరికి 50వేలు చొప్పున ఇస్తున్నారని తెలిపారు. విశాఖకు తిరిగి రప్పించడం పట్ల కంబోడియా బాధితులు చాలా హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారన్నారు సీపీ రవిశంకర్‌ అయ్యనార్‌. విశాఖ పోలీసులు ఇచ్చిన ధైర్యంతోనే కంబోడియా గ్యాంగ్‌ చిత్రహింసలపై పోరాటం చేసినట్లు చెప్పారన్నారు. 

Read More అనాధ పిల్లల చదువుకు వైష్ణవి ఆర్థిక సహాయం

ఇదిలావుంటే.. ఇకపై విదేశాల్లో ఉద్యోగాల కోసం రిజిష్టర్డ్‌ ఏజెంట్ల ద్వారానే వెళ్లాలని నిరుద్యోగులకు సూచించారు విశాఖ సీపీ రవిశంకర్‌ అయ్యనార్‌. విశాఖలో 70 నుంచి 80 మంది వరకు ఫేక్‌ ఏజెంట్లు ఉన్నారని.. వాళ్లందరికి హ్యూమన్‌ ట్రాఫికింగ్‌పై వార్నింగ్‌ ఇస్తామన్నారు. మొత్తంగా.. కంబోడియా కేటుగాళ్ల కేసులో విశాఖ సీపీ రవిశంకర్‌ అయ్యనార్‌ ఆపరేషన్ సూపర్‌ సక్సెస్‌ అయింది. కంబోడియాలోని ఇండియన్‌ ఎంబసీ సహకారంతోనే 48 గంటల్లో బాధితులను తీసుకొచ్చి శభాష్‌ అనిపించుకున్నారు. ఇక.. దేశ వ్యాప్తంగా జరిగిన సైబర్‌ స్కామ్‌కు సంబంధించి డొంక కదిలించేందుకు సిద్ధమవుతున్నారు విశాఖ పోలీసులు.

Read More ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చర్చ సమావేశం

Latest News

ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫ్రెండ్ రిసెప్షన్ కి వెళ్లి.. తిరిగిరాని లోకానికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
జయభేరి, సైదాపూర్  : సైదాపూర్ మండల్ రామచంద్రపూర్ విలేజ్ లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో పొన్నం మహేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిసెప్షన్ లో పాల్గొని...
విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
యాద్గారపల్లి చౌరస్తా లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నాయకులు
ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
ప్రజా పాలన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి సంవత్సరం అభివృద్ధి పనుల వివరాలు...
ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి