Health : సరిపడా నిద్రలేకపోతే షుగర్‌ ముప్పు

6 గంటల కంటే తక్కువ నిద్రిస్తున్న వారికి రిస్క్‌... బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి..

  • యూకే బయోబ్యాంక్‌లోని 2.5 లక్షల మంది డాటాను అధ్యయనం చేసిన తర్వాత షుగర్‌ వ్యాధికి, నిద్రకు సంబంధం ఉందని పరిశోధకులు తేల్చారు. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి మధుమేహ ముప్పును దూరం చేస్తుందని, ఇదే సమయంలో సరిపడా నిద్ర పోవడం కూడా ముఖ్యమేనని పేర్కొన్నారు.

Health : సరిపడా నిద్రలేకపోతే షుగర్‌ ముప్పు

లండన్‌, ఏప్రిల్‌ 22
సరిపడా నిద్రపోని వారిలో మధుమేహ వ్యాధి ముప్పు పెరుగుతున్నదని బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు గుర్తించారు. యూకే బయోబ్యాంక్‌లోని 2.5 లక్షల మంది డాటాను అధ్యయనం చేసిన తర్వాత షుగర్‌ వ్యాధికి, నిద్రకు సంబంధం ఉందని పరిశోధకులు తేల్చారు. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి మధుమేహ ముప్పును దూరం చేస్తుందని, ఇదే సమయంలో సరిపడా నిద్ర పోవడం కూడా ముఖ్యమేనని పేర్కొన్నారు. సాధారణంగా ఒక మనిషి రోజుకు 7 – 8 గంటలు నిద్రపోవాలని, ఆరు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతున్న వారిలో షుగర్‌ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్టు గుర్తించారు. రోజుకు 7 – 8 గంటలు నిద్రపోతున్న వారితో పోలిస్తే ఐదు గంటల పాటు నిద్ర పోతున్న వారిలో మధుమేహం బారిన పడే ముప్పు 16 శాతం ఎక్కువని, రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు నిద్రపోతున్న వారిలో 41 శాతం ఎక్కువని పరిశోధకులు తేల్చారు. కచ్చితంగా రోజుకు 7 – 8 గంటల పాటు మంచి నిద్ర ఉండేలా చూసుకోవాలని సూచించారు.

Latest News

సైదాపూర్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్గా దొంత సుధాకర్ సైదాపూర్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్గా దొంత సుధాకర్
జయభేరి, సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంతు సుధాకర్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా...
వచ్చే 20-25 ఏళ్లపాటు భారతదేశం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఇదీ మోదీ అనే అసామాన్య వ్యక్తి సాధించిన విజయం. బీజేపీ కాషెట్టి కుమార్ 
collector vijaya krishnan : ప్రజా సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలి కలెక్టరు విజయ కృష్ణన్
భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొన్న ఎంపీపీ పైల, మాజీ సర్పంచ్ చుక్కా
ఘనంగా బండారు శ్రీను గురుస్వామి అయ్యప్ప పడిపూజ
పరవాడలో ఘనంగా కార్తీకమాస అన్న సమారాధన కార్యక్రమం