విచిత్ర, విపరీత ప్రకృతి వైపరీత్యానికి కారణమేంటి

ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాలు, దేశాల్లో ఇప్పుడు విచిత్ర వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.  తీవ్ర ఎండ, వేడి గాలులు ఈ ఏడాది హజ్‌ యాత్రకు బయల్దేరినవారికి తీవ్ర ఇబ్బందిగా మారింది. వడదెబ్బతో యాత్రీకులు పిట్టల్లా రాలుతున్నారు. ఇప్పటికే 1000 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో భారతీయులు 98 మంది ఉన్నారు.

విచిత్ర, విపరీత ప్రకృతి వైపరీత్యానికి కారణమేంటి

ఓ ప్రాంతంలో భరించలేని ఎండలు. మరో ప్రాంతంలో తట్టుకోలేనంత చలి. ఇంకో ప్రాంతంలో ముంచెస్తున్న వరదలు. ఒక్కో దేశంలో ఒక్కో రకమైన పరిస్థితి. మొత్తానికి ప్రకృతి మనుషులతో ఓ ఆట ఆడుకుంటోంది. ఆట కూడా అనకూడదేమో.. తాండవం.. విలయతాండవం ఆడుతుంది. ఇంతకీ ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది ? ఈ విచిత్ర, విపరీత ప్రకృతి వైపరీత్యానికి కారణమేంటి ? ఈ దేశం ఆ దేశం అని లేదు. 

ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాలు, దేశాల్లో ఇప్పుడు విచిత్ర వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.  తీవ్ర ఎండ, వేడి గాలులు ఈ ఏడాది హజ్‌ యాత్రకు బయల్దేరినవారికి తీవ్ర ఇబ్బందిగా మారింది. వడదెబ్బతో యాత్రీకులు పిట్టల్లా రాలుతున్నారు. ఇప్పటికే 1000 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో భారతీయులు 98 మంది ఉన్నారు. ఈమేరు విదేశాంగ శాఖ అధికారికంగా వెల్లడించిందిఈ ఏడాది భారత్‌నుంచి 1.75 లక్షల మంది హజ్‌ యాత్రకు వెళ్లారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ భారతీయుల కోసం కేంద్రం ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉంటే ఏటా హజ్‌ యాత్రకు వెళ్లి 5 లక్షల మంది మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 

Read More వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు

వాస్తవ సంఖ్య ఇందుకు 30 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు 10 దేశాలకు చెందిన 1,081 మంది మరణించినట్లు అక్కడి వైద్యాధికారులు ధ్రువీకరించారు. అత్యధికంగా ఈజిప్టుకు చెందిన యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.ఈ ఏడాది సౌదీలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత వారంలో 51.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఈ ఏడాది 18.3 లక్షల మంది హజ్‌ యాత్ర పూర్తి చేసుకున్నారు. ఇందులో 22 దేశాలకు చెందిన యాత్రీకులు 16 లక్షల మంది ఉన్నారు. 

Read More ఆసుపత్రిలో చేరిన ఎల్.కె.అద్వానీ

ఇక సౌదీవాసులు 2 లక్షల మంది ఉంటారని అంచనా ఇప్పుడు అనేక దేశాల్లో టెంపరేచర్స్ అంతకంతకు పెరిగిపోతున్నాయి.మన దేశాన్నే తీసుకోండి. మాములుగా ఉత్తర భారతంలో వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఇక ఈ టైమ్‌కు అయితే ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతాయి. బట్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మెయిన్‌గా ఢిల్లీ, యూపీ, హర్యానాలో వేడి గాలులు వీస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో అయితే నార్మల్‌ కంటే ఏకంగా ఆరు డిగ్రీ సెంటిగ్రెడ్‌లు ఎక్కువ టెంపరేచర్‌ నమోదవుతుంది. ఒక్క బిహార్‌లోనే 24 గంటల్లో 22 మంది చనిపోయారు. రెడ్ అలర్ట్‌లు జారీ అవుతున్నాయి. అడపాదడపా వర్షాలు కురిసినా ఉక్కపోత, ఎండలు మాత్రం తగ్గడం లేదు. 

Read More జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు

హిల్ టౌన్స్‌ అయిన పౌరీ, నైనిటీల్‌లో కూడా వేడి గాలులు వీస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడు నెలలుగా ఇక్కడ చుక్క వర్షం పడలేదు.ఇది ఇండియా బాధ. ఈస్ట్ దేశాలలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 50 డిగ్రీల టెంపరేచర్‌ నమోదవడం కామన్‌గా మారింది. ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టాలంటే జడుసుకునే పరిస్థితి ఉంది. దీనికి బెస్ట్‌ ఉదాహరణే హజ్ యాత్ర. గతంలో ఎప్పుడూ లేనంతగా మక్కాకు వచ్చే ముస్లిం భక్తులు చనిపోతున్నారు. ఇక మరో విచిత్ర పరిస్థితి ఏంటంటే.. ఎక్కడైతే ఇంత భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో.. అదే మిడిల్ ఈస్ట్‌ కంట్రీలో ఉన్నట్టుండి అత్యంత భారీ వర్షం కురవడం, వరదలు రావడం జరుగుతోంది. 

Read More అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు

ఎడారి దేశాల్లో వరదలు రావడం అనేది చాలా అరుదు. కానీ ఇప్పుడు చాలా కామన్‌గా మారిపోయింది. ఆ వరదలకు జనాలు చనిపోవడం కూడా అంతే కామన్‌గా మారిపోయింది.కొన్ని దేశాలు ఇలా ఎండలు, వానలతో కిందా, మీదా పడుతుంటే.. మంగోలియా పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ చలిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు అక్కడి ప్రజలు. ఇక చలి దెబ్బకు చనిపోతున్న జంతువుల సంఖ్యకైతే అసలు లెక్కేలేదు. ఇక్కడ జడ్‌.. అంటే తీవ్ర అనావృష్టి తరువాత వాతావరణం ఉన్నట్టుండి అతి శీతల చలికాలం రావడం. ఇప్పుడీ జడ్‌ మంగోలియాను షేక్ చేస్తుంది. ఇప్పుడీ జడ్ కారణంగా అక్కడ పచ్చగడ్డి కూడా మొలవడం లేదు. ఈ ఇయర్‌లో జడ్ కారణంగా 71 లక్షల పశువులు మృతి చెందాయి. 

Read More డిజిటల్ అగ్రికల్చర్ మిషన్

ఇందులో పశువులు, గొర్రెలు, మేకలు ఉన్నాయి. జడ్ కారణంగా కోటి 49 లక్షల పశువులు చనిపోతాయని అంచనాలు ఉన్నాయి. నిజానికి మంగోలియాలో పశువులు, యాక్‌లు, గొర్రెలు, మేకలు, గుర్రాలను జాతీయ సంపదగా ఆ దేశ రాజ్యాంగం గుర్తించింది. మంగోలియా ఎక్స్‌పోర్ట్స్‌లో మాంసానిది సెకండ్ ప్లేస్. ఇప్పుడు జెడ్‌ కారణంగా మంగోలియా ఎక్స్‌పోర్ట్స్‌కు దెబ్బ పడినట్టే. నిజానికి జెడ్‌ పదేళ్లకు ఒకసారి వచ్చేది ఈ జడ్‌. కానీ గడచిన పదేళ్లలో ఇప్పుడు వచ్చిన జడ్.. ఆరోది. అంటే ప్రకృతిలో ఎంత మార్పు వస్తుందో అర్థం చేసుకోవచ్చు.ముందే చెప్పుకున్నాం కదా.. ఓ చోట ఎండ.. మరో చోట వరద.. మరో చోట చలి. 

Read More ₹10 కాయిన్ ను తిరస్కరిస్తే చట్టరీత్య నేరమే

ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశం ఏదో రకమైన ప్రకృతి వైపరిత్యంతో ఇబ్బందులు పడుతూనే ఉంది. మరి దీనికి రీజన్ ఏంటో తెలుసా ? రోజురోజుకు పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్. రోజురోజుకు గ్రీన్‌ హౌస్‌ గ్యాస్ రిలీజ్‌ పెరుగుతుందే తప్ప.. తగ్గడం లేదు. ఇవన్నీ భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. నిజానికి ప్రతి ఏడాది గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. ఆసియా నుంచి అంటార్కిటికా దాకా.. అత్యంత పేద దేశం నుంచి ధనిక దేశం దాకా.. ఇలా అన్ని వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తుంది. అనేక నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అమలు విషయానికి వస్తే అంతంత మాత్రమే. కర్బన ఉద్గారాలు పెరుగుతూనే ఉంటాయి. మంచు కరుగుతూనే ఉంటుంది. సముద్రాలు పెరుగుతూనే ఉంటాయి. ఇలా ప్రకృతి ప్రకోపం చూపిస్తూనే ఉంటుంది. మరి ఇంకెప్పుడు మారుతారో చూడాలి. ఇప్పటికే పరిస్థితి చేయిదాటి పోతుందని వార్నింగ్ ఇస్తున్నారు వాతావరణ నిపుణులు.

Read More బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత

Latest News

సైదాపూర్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్గా దొంత సుధాకర్ సైదాపూర్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్గా దొంత సుధాకర్
జయభేరి, సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంతు సుధాకర్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా...
వచ్చే 20-25 ఏళ్లపాటు భారతదేశం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఇదీ మోదీ అనే అసామాన్య వ్యక్తి సాధించిన విజయం. బీజేపీ కాషెట్టి కుమార్ 
collector vijaya krishnan : ప్రజా సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలి కలెక్టరు విజయ కృష్ణన్
భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొన్న ఎంపీపీ పైల, మాజీ సర్పంచ్ చుక్కా
ఘనంగా బండారు శ్రీను గురుస్వామి అయ్యప్ప పడిపూజ
పరవాడలో ఘనంగా కార్తీకమాస అన్న సమారాధన కార్యక్రమం