Money I మన సంపాదన ఎంతవరకు?

జీవితంలో విజయం సాధించడం అంటే బాగా బాగా డబ్బు సంపాదించడం, ఎక్కువ మందికి తెలియడం. ఇదే కాదు 80% ప్రజలు తమ పిల్లలకు తోటివాళ్లకు చెప్పేది మాట్లాడేది నమ్మేది. 90% ప్రజలు జీవితాంతం చేస్తున్న పని కూడా అదే కదా...

Money I మన సంపాదన ఎంతవరకు?

జీవితంలో విజయం సాధించడం అంటే బాగా బాగా డబ్బు సంపాదించడం, ఎక్కువ మందికి తెలియడం. ఇదే కాదు 80% ప్రజలు తమ పిల్లలకు తోటివాళ్లకు చెప్పేది మాట్లాడేది నమ్మేది. 90% ప్రజలు జీవితాంతం చేస్తున్న పని కూడా అదే కదా. ఇంకా ఇంకా ఇంకా సంపాదించాలి సంపాదించాలి. ఫ్లాట్, ఇల్లు, నగలు, భూమి ఇలా కొంటూ పోతూనే ఉన్నారు కదా. కావాలంటే మీ చుట్టూ ఉండే బంధువులను స్నేహితులను పరిశీలించండి మీకు తెలిసిపోతుంది. ఎంత సంపాదించాలి? ఎంత సంపాదించి ఇక సంపాదన గురించి ఆపవచ్చు అనే విషయం ఎవరికీ అయినా తెలుసా? ఎవరైనా అలా ఆపేశారా? నాకు తెలిసి మీకు ఎవరూ కన్పించకపోవొచ్చు.

M1

Read More Telangana I ఒక కవితా సంకలనం కౌమార భావోద్వేగాల లోతుల్లోకి వెళుతుంది

సరే ఎన్నో చేసి బాగా సంపాదించారు, ఇంకా సంపాదిస్తున్నారు, మరి మీ పిల్లలు ఎం చేయాలి?  వాళ్ళు కూడా సంపాదించాలా? వాళ్ళు కూడా మీ లాగ బాగా కష్టపడి,ఇష్టపడి సంపాదించాలా? మీకు అవును అనే అనిపించవచ్చు కాని పిల్లలకు అలా అనిపించదు కదా!

Read More నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

m6

Read More దర్శకుడు నాగ్ అశ్విన్‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు.. బుజ్జి ఏమన్నారంటే..

మీ పిల్లలు పుట్టడమే పెద్ద పెద్ద బంగ్లాలో పుడతారు, ఎసి గదుల్లో నిదురపోతారు, ఎసి బస్సుల్లో స్కూలుకు పోతారు, విమాన ప్రయాణాలు చేస్తారు, ఖరీదైయిన కార్లలో తిరుగుతారు, ఇవన్నీ చూసిన చేసిన తరువాత వాళ్లకు జీవితంలో ఇంకేంచేయాలి అనుకుంటారు? ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. ఇంకేముంది చేయటానికి? అప్పటికే ఆ పిల్లలు ఫలానా ఆయన పిల్లలు అనే పేరు ప్రఖ్యాతులు, సెలబ్రెటీ హోదా వచ్చి ఉంటుంది, అప్పటికే కావలసినంత సంపద ఉంటుంది, మరి వాళ్ళు జీవితంలో ఏం చేయాలి? ఏం చేయటానికి అయినా మోటివేషన్ ఏంటి? ఏమి లేదు, మరి సిగరెట్లు, మద్యం అనేది వాళ్లకు కిక్ ఇవ్వవు, మరి మిగిలింది డ్రగ్స్! మాములు మనుషులకు ప్రపంచంలో దొరకనిది ఖరారు అయినవి ఏంటి అంటే డ్రగ్స్, అందుకే బాగా రిచ్ కిడ్స్ కొందరు డ్రగ్స్ కు అలవాటు అవుతారు.

Read More నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

m12

Read More సోషల్ మీడియాను ఊపేస్తోన్న అమ్మపాడే జోలపాట సాంగ్.. 

ఎవరికైనా మోటివేషన్ అవసరం! అది లేనప్పుడు మనిషి దారి తప్పుతాడు. కుటుంబం లేని వాళ్ళు, పేదవాళ్ళు జీవితంలో ఏం చేసినా జీవితం మారదు అనుకునేవాళ్లు తొందరగా రక రకాల రుగ్మతలకు బానిసలు అవుతారు. సమాజంలోని అట్టడుగున ఉన్న అనాధలు, కుటుంబ పోషణ లేనివాళ్లు లేదా బాగా ధనవంతులు వీళ్లిద్దరి జీవితాలు దాదాపుగా ఒకేవిధంగా ఉంటాయి. మనుషులం అందరం భూమి మీద బ్రతికి ఉండడమే మనుషులందరి గమ్యం కావాలి అనే విషయాలను ఎవరూ ఎక్కడా చెప్పడం లేదు మాట్లాడడం లేదు, ఎంత సేపు లక్ష్యం, పోటీ, పోల్చుకోవడం, సాధించడం అనే నేర్పిస్తారు, మాట్లాడుతారు. సాటి మనుషులకు సహాయ పడడం, పంచుకోవడం, కలిసి జీవించడం అనే విషయాలు నేర్పిస్తే, అలవాటు చేస్తే మనుషులు రుగ్మతలకు బలహీనతలకు లోను కారు కదా!

Read More Love : అమ్మను ప్రేమించలేనోడికి  అమ్మాయి కావాల్సొచ్చిందిరా?

m7

Read More April Fools Day : ఏప్రిల్ ఫూల్స్ డే చరిత్ర...

ఒక కుటుంబానికి సరిపోయినంత సంపద కలిగిన తరువాత అయినా సంపాదించడం అనే ఆలోచన విరమించుకోండి, లంచాలు, మోసాలు ఆపండి. సంపాదన అనేది పిల్లలకు మేలు చేయదు, పిల్లలకు మేలు చేసేది వాళ్ళు పెరిగే మంచి వాతావరణం, మంచి ఆహారం, మంచి విద్య, మంచి ఇరుగు పొరుగు, మంచి పాఠశాల ఇవి మేలు చేస్తాయి. సంపాదించడం సంపద అనేవి మనుషులను మూర్ఖులుగా ద్రోహులుగా లంచగొండ్లుగా మారుస్తుంది. సంపాదన అనేది మనిషి వర్తమానాన్ని హరిస్తుంది, మనిషికి ఎప్పుడూ ప్రాణభీతిని కలిగిస్తుంది. తృప్తి అనేది మనిషికి ధైర్యాన్ని సంతోషాన్ని ఇస్తుంది. ఆలోచించండి మరి!

Read More ఇది ఒక ధ్యాన అనుభవం

m4

Read More Money : రూపాయి నీ రూపం ఏది!?

ఇది చదివిన తరువాత వీడికేమి తెలుసు గొట్టం గాడు చెప్పేది అనుకోవొచ్చు. అవును మనకు మన చుట్టూ ఉన్నవాళ్లు చెబితే నచ్చదు, అందుకు మహర్షులు,ఋషులు,గురువులు, స్వాములు,వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఎక్కువమందికి తెల్సిన వాళ్ళు చెబితే చప్పట్లు కొడతాం, టికెట్ పెట్టి మరీ వింటాం, ఆహా ఓహో అంటాం, ఎందుకంటే శంఖంలో పోస్తేనే కదా తీర్థం అని అనిపించుకునేది.

Read More Auto I షౌకత్ గ్యారేజ్

- రఘునాథ్ గౌడ్

93489 35340

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన

Social Links

Related Posts

Post Comment