Sports : హాకింపేట లోని క్రీడా పాఠశాల లో జిల్లా స్థాయి బాల బాలికల పరుగు పందెం పోటీల ఎంపిక
ఈ నెల 28న సూర్యాపేట లో రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీలు - ఆర్మీ సెక్రటరీ కూరపాటి రాజశేఖర్
- సూర్యాపేట లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీల్లో మేడ్చల్ జిల్లా నుంచి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎంపిక చేస్తామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కోరారు.
జయభేరి, ఏప్రిల్ 21:
మేడ్చల్ జిల్లా హాకింపేట లోని తెలంగాణ క్రీడా పాఠశాలలో జిల్లా స్థాయి అండర్ 14, 16, 18, 20 బాల బాలికల పరుగు పందెం పోటీల ఎంపిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆర్మీ సెక్రటరీ కూరపాటి రాజశేఖర్ మాట్లాడుతూ... ఈ నెల 28 న సూర్యాపేట లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీల్లో మేడ్చల్ జిల్లా నుంచి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎంపిక చేస్తామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కన్స్ట్రక్షన్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్, జాయింట్ సెక్రటరీ శేఖర్, తెలంగాణ క్రీడా పాఠశాల పిఈటీ గోపాల్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Latest News
11 Apr 2025 19:50:55
సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు...
Post Comment