కేర్ ఆధ్వర్యంలో  వైద్య సదస్సు     

సిటిఓ కు జపనీస్ కుట్టులేని సాంకేతికత వైద్య విధానంలో చికిత్స అందించడం ద్వారా 90% శస్త్రచికిత్సలు విజయవంతం అయ్యాయన్నారు. గుండె వైఫల్యాన్ని ఎదుర్కొనే రోగులకు నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఈ సాంకేతికత బాగుందని చెప్పారు. తాము ఇప్పటికే పలువురు రోగులకు ఈ విధానంలో విజయవంతంగా చికిత్సలు చేశామన్నారు.

కేర్ ఆధ్వర్యంలో  వైద్య సదస్సు     

జయభేరి, హైదరాబాద్ :
హృద్రోగ సమస్యలు, చికిత్స విధానాలపై బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో అంతర్జాతీయ వైద్య సదస్సును జూన్ నెల 7 8 9 తేదీల్లో నిర్వహించనున్నారు.

ఇండో జపనీస్ సిటీఓ క్లబ్ సహకారంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు కేర్ ఆస్పత్రి మీడియా మేనేజర్ శివశంకర్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో ముఖ్యంగా కరోనరీ ఆర్టరీ డిసీజ్ (సిఎడి) తో బాధపడే రోగులకు అందించే వైద్య చికిత్సలను చర్చించనున్నారు.

Read More ఉర్దూ భాషా ప్రచారం ను వేగవంతం చేయాలి, భావి తరాలకు రోజు రెండు గంటలు బోధించాలి...

బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో నిర్వహించే వైద్య సదస్సులో హృద్రోగులు పాల్గొని తమ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడంతో పాటు వైద్య చికిత్స సైతం పొందవచ్చని ఆసుపత్రి క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ బి సూర్యప్రకాశ్రావు పేర్కొన్నారు. సిఏడి ప్రజలకు తీవ్ర ఆరోగ్య సమస్యగా ఉందన్నారు. ఈ సమస్యతో దాదాపు 27% హృద్రోగులు మృతి చెందుతున్నారని అన్నారు. సిఏడి రూపాలలో క్రానిక్ టోటల్ అక్లూజన్ (సిటిఓ) ఒకటి అన్నారు. సాధారణంగా సిటిఓ కు బైపాస్ సర్జరీ ద్వారా చికిత్స అందిస్తారని, అయితే ఈ విధానం చిన్నారులు, వృద్ధులకు సవాలుగా ఉందన్నారు.

Read More అమ్మో... ఎంత హడావిడి చేసిందో...

ఈ తరుణంలో సిటిఓ కు జపనీస్ కుట్టులేని సాంకేతికత వైద్య విధానంలో చికిత్స అందించడం ద్వారా 90% శస్త్రచికిత్సలు విజయవంతం అయ్యాయన్నారు. గుండె వైఫల్యాన్ని ఎదుర్కొనే రోగులకు నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఈ సాంకేతికత బాగుందని చెప్పారు. తాము ఇప్పటికే పలువురు రోగులకు ఈ విధానంలో విజయవంతంగా చికిత్సలు చేశామన్నారు.

Read More సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

కేర్ సీవోవో సయ్యద్ కమ్రాన్ హుస్సేన్ మాట్లాడుతూ... క్రానిక్ టోటల్ అక్లూజన్ చికిత్స కోసం జపనీస్ కుట్టు లేని సాంకేతికత ఓ కీలకమైన పురోగతిని సాధించింది అన్నారు. నగరంలో జరగబోయే అంతర్జాతీయ వైద్య సదస్సులో కేర్ ఆస్పత్రి కి చెందిన డాక్టర్ ప్రియన్ కాంతిలాల్ షా, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ ఏ ఎస్ వి నారాయణరావు, డాక్టర్ సూర్యప్రకాశ్రావు విట్టల, డాక్టర్ పి ఎల్ ఎన్ కపర్ది, డాక్టర్ రేవనూరు విశ్వనాథ్ తదితరులు పాల్గొననున్నారు.

Read More  చిరంజీవి ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయలు విరాళం

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన