దాదాపు 20 ఏళ్లు గడిచిపోయాయి.

దాదాపు 20 ఏళ్లు గడిచిపోయాయి.

జయభేరి, హైదరాబాద్‌: ఆ కుర్రాడు అప్పుడే హీరోగా తెలుగులో పరిచయమవుతున్నాడు. ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్‌కూ దర్శకుడిగా అదే తొలి సినిమా. ఆ మూవీ ప్రారంభం సందర్భంగా దేశంలోని అగ్ర కథానాయకుల్లో ఒకరైన చిరంజీవి వచ్చి తన అభినందనలు తెలిపారు. హీరో-హీరోయిన్లతో కలిసి ఫొటో కూడా దిగారు.

ఆ సినిమా 'ప్రేమ పుస్తకం'. ఆ హీరో అజిత్‌. ఒక్కో మెట్టు ఎక్కుతూ తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి క్రేజీ ఉన్న హీరోగా అజిత్‌ పేరు తెచ్చుకున్నారు. దాదాపు 20 ఏళ్లు గడిచిపోయాయి. ఇన్నేళ్ల తర్వాత చిరంజీవిని కలిసిన అజిత్‌ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Read More ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రక్షిత్ అట్లూరి “ఆపరేషన్ రావణ్” సినిమా

అజిత్‌  కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న చిత్రం 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ'. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. మరోవైపు చిరంజీవి కథానాయకుడిగా ‘విశ్వంభర’ రూపొందుతోంది. సోషియో ఫాంటసీ కథతో రానున్న ఈ సినిమా షూటింగ్‌ కూడా ఇక్కడే జరుగుతోంది.

Read More “పుష్ప 2”: ఒక పాట.. 6 భాషల్లో ఒక గాయకుడు

ఈ క్రమంలో 'విశ్వంభర' సెట్స్‌కు అజిత్‌ వెళ్లారు. అజిత్‌ను సాదరంగా ఆహ్వానించిన చిరు ఆయనతో కలిసి కొద్దిసేపు మాట్లాడారు. ఇద్దరూ తమ సినిమాల గురించి చర్చించుకున్నారు. ఈ క్రమంలో చిరునవ్వులు చిందిస్తూ చిరంజీవి, అజిత్‌ దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. 20 ఏళ్ల కిందట 'ప్రేమ పుస్తకం' కోసం దిగిన ఫొటోను జత చేస్తూ అభిమానులు సోషల్‌మీడియాలో పంచుకున్నారు.

Read More స్టార్ హీరో కొడుకుతో చిరంజీవి కూతురు పెళ్లి?

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన

Social Links

Related Posts

Post Comment