మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు

ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేశానని బాధితుడు చెబుతున్నాడు. అయితే సర్వేనెంబర్ 32, 35, 36, 38లో ఓ ఫంక్షన్ హాల్‌ను గతంలో నిర్మించుకున్నానని, తన భూమి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉందని చెప్పాడు. 2023లో ఫంక్షన్ హాల్‌ని పడగొట్టి జీవన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని సదరు బాధితుడు ఆరోపిస్తున్నాడు.

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు

రంగారెడ్డి జిల్లా : 
మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి, అతని కుటుంబ సభ్యలపై చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. 

జీవన్‌రెడ్డి తన భూమిని కబ్బా చేశారని చేవెళ్ల పీఎస్‌లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేశానని బాధితుడు చెబుతున్నాడు. అయితే సర్వేనెంబర్ 32, 35, 36, 38లో ఓ ఫంక్షన్ హాల్‌ను గతంలో నిర్మించుకున్నానని, తన భూమి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉందని చెప్పాడు. 2023లో ఫంక్షన్ హాల్‌ని పడగొట్టి జీవన్‌రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని సదరు బాధితుడు ఆరోపిస్తున్నాడు.

Read More సెప్టెంబర్ 17న  ప్రజా పాలన దినోత్సవం

కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబ్ గ్యాంగ్‌ను జీవన్ రెడ్డి పెట్టి తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన భూమిని తనకు ఇవ్వాలని అడిగితే పంజాబ్ గ్యాంగ్‌తో మారణాయుధాలతో దాడి చేసి భయాబ్రాంతులకు గురి చేశారని సదరు బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. తన భూమిని జీవన్‌రెడ్డి నుంచి విడిపించాలని చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. తనకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని, జీవన్‌రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని సదరు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై 447, 427, 341, 386, 420, 506 r/w 34 ఐపీసీ (ఆరు సెక్షన్ల కింద) పోలీసులు కేసు నమోదు చేశారు..

Read More శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన