రేవంత్ రెడ్డి కి ఓటు వేసి తప్పు చేశాం అంటున్న ప్రజలు....

ప్రజలు మళ్ళీ కెసీఆర్ పాలన కోరుకుంటున్నారు... గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి 

రేవంత్ రెడ్డి కి ఓటు వేసి తప్పు చేశాం అంటున్న ప్రజలు....

జయభేరి, గజ్వేల్, అక్టోబర్ 06 : 
కెసిఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మనీయంగా ఉంటారని భారసా గజ్వేల్ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలను మానుకోవాలని హెచ్చరించారు. 

కెసిఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు గజ్వేల్  ఎట్లా ఉండెను నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. బిఆర్ఎస్ అధికారం వచ్చాకనే 50 ఏళ్ల ముందుకు వెళ్లామని వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు దమ్ముంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన 170 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను వెంటనే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. కెసిఆర్ అభివృద్ధిలో గజ్వేల్ నియోజకవర్గం గ్రూపు రేఖలు మార్చారన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వము ఉన్నప్పుడు ప్రతి ఒక రంగానికి అభివృద్ధిలో తోడ్పడ్డారని తెలిపారు. 

Read More తెలంగాణ క్రీడా పాఠశాలలో 2k రన్ విజయవంతం చేయాలి

అబద్ధపు హామీలు ఇచ్చి అమలు కాని గ్యారెంటీ లతో గద్దెనెక్కి కూర్చున్నారని. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆరు గ్యారెంటీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జెడ్పిటిసి పంగ మల్లేశం,గజ్వేల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జహీరుద్దీన్, మండల పార్టీ అధ్యక్షుడు బెండే మధు, తాజా మాజీ సర్పంచులు, శ్రీనివాస్ రెడ్డి దయాకర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు

Read More అండగా ఉంటున్న ఇండస్ట్రీనే అవమానిస్తున్నారు...