కేసీఆర్ గారు మిరెక్కడా...? 

గజ్వేల్ పోలీస్ స్టేషన్లో కేసీఆర్ కనబడటం లేదని ఫిర్యాదు...

కేసీఆర్ గారు మిరెక్కడా...? 

జయభేరి, గజ్వేల్, అక్టోబర్ 06 : కెసీఆర్ వారంలోగా పోలీస్ అధికారులు జాడ తెలియజేయకపోతే మేము వెతుకుంటాం అని పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు తెలిపారు.సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించడం లేదంటూ గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు, స్థానిక నేతలతో కలిసి పిర్యాదు చేశారు.

కేసీఆర్ ఆచూకీ తెలిపి నియోజకవర్గ ప్రజల ముందుకు తేవాలని ఆయన పోలీస్ అధికారులను కోరారు. లేదంటే ఇక మేమే వెత్తుకుంటామన్నారు. గెలిచి పదినెలలు కావోస్తున్న ఇప్పటికీ నియోజకవర్గంలో నీ జాడలేదన్నారు శ్రీకాంత్ రావు. నీ బాధ్యతల్ని మరిచవా కేసీఆర్ ప్రజల సొమ్ముని వేతనంగా తీసుకుంటున్నావు కదా అన్నారు.. నియోజకవర్గ ప్రజల కాలికి ముల్లు దిగితే పంటితో తీస్తనన్నావు కదా, మేము ముళ్ళు గుచ్చుకుంటాము నువ్వు తీయడాని రా అని కోరారు.

Read More సౌత్ జోన్ ఈఎన్ టీ సర్జన్ కాన్ఫరెన్స్ ప్రారంభం

నీ యోగ క్షేమాలు తెలుసుకోవాల్సిన బాధ్యత నిన్ను గెలిపించిన గజ్వేల్ ప్రజల మీద ఉంది కదానన్నారు. నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమ పనులు అసంపూర్తిగా మిగిలాయి వాటిపై ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు.పోలీస్ లా నుండి సమాచారం రాకపోతే కేసీఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని నేరుగా సందర్శించి యోగక్షేమాలు తెలుసుకుంటామని శ్రీకాంత్ రావు పేర్కొన్నారు.

Read More రేవంత్ రెడ్డి కి ఓటు వేసి తప్పు చేశాం అంటున్న ప్రజలు....