ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్

స్మార్ట్ వాచ్ లలో ఫీచర్లు శరీర కదలికలను బట్టి ఫిట్నెస్ లెవల్స్, హార్ట్ బీట్, పల్స్ చెప్పేస్తున్నాయి. దీంతో ఇటీవల స్మార్ట్ వాచ్ ల వినియోగం పెరిగింది. వీటిల్లో ముఖ్యంగా యాపిల్ స్మార్ట్ వాచ్ లకైతే ప్రత్యేక డిమాండ్ ఉంది. వీటిల్లో రీడింగ్స్ కచ్చితత్వం ఉంటాయని ప్రజల్లో నమ్మకం. యాపిల్ వాచ్ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి సరైన సమయంలో హెచ్చరికలు జారీచేస్తుంది.

ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్

జయభేరి, కరీంనగర్ :
మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. స్మార్ట్ పరికరాల హవా కొనసాగుతోంది. ఆరోగ్య సమస్యలను అలర్ట్ చేసేందుకు స్మార్ట్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. స్మార్ట్ వాచీలు, స్మార్ట్ రింగ్ లు , స్మార్ట్ బ్యాండ్ లు ఇలా పేరు ఏదైనా సరే ఫిట్నెస్, హెల్త్ ఇష్యూస్ పై అలర్ట్ చేస్తున్నాయి. 

ముఖ్యంగా స్మార్ట్ వాచ్ లలో ఫీచర్లు శరీర కదలికలను బట్టి ఫిట్నెస్ లెవల్స్, హార్ట్ బీట్, పల్స్ చెప్పేస్తున్నాయి. దీంతో ఇటీవల స్మార్ట్ వాచ్ ల వినియోగం పెరిగింది. వీటిల్లో ముఖ్యంగా యాపిల్ స్మార్ట్ వాచ్ లకైతే ప్రత్యేక డిమాండ్ ఉంది. వీటిల్లో రీడింగ్స్ కచ్చితత్వం ఉంటాయని ప్రజల్లో నమ్మకం. యాపిల్ వాచ్ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి సరైన సమయంలో హెచ్చరికలు జారీచేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాపిల్ వాచ్ బీజేపీ నేత ప్రాణం కాపాడిందిరాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ యాపిల్ వాచ్ వాడుతున్నారు. 

Read More మేక పాలు తాగితే రక్తపోటు సమస్యకు చెక్

గత కొంత కాలంగా కొంత దూరం నడిస్తే ఆయాసం, ఛాతిలో నొప్పి, మంటలా ఉన్నా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. గ్యాస్ట్రిక్ సమస్య అనుకుని వదిలేశారు. అయితే ఆయన వాడుతున్న యాపిల్ వాచ్ ఓ అలర్ట్ పంపింది. గుండెపోటు ప్రమాదం ఉందని దాని సారాంశం. దీంతో ఆయన నిర్లక్ష్యం చేయకుండా గుండెకు సంబంధించిన ఇబ్బంది ఉందని వరంగల్ వైద్యులను సంప్రదించారు. రామకృష్ణను పరీక్షించిన వైద్యులు గుండెకు సంబంధించిన రెండు రక్తనాళాలు మూసుకుపోయాయని గుర్తించారు. దీంతో ఆయన మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి వెళ్లారు. యశోదలో వైద్య పరీక్షలు చేయించుకుని, వైద్య సేవలు పొందారు. గత కొద్ది కాలంగా వాడుతున్న యాపిల్ వాచ్ తన ప్రాణాలను కాపాడిందని బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ అన్నారు.

Read More Health : సరిపడా నిద్రలేకపోతే షుగర్‌ ముప్పు

యాపిల్ వాచ్ ఆరోగ్య పరిస్థితిని తెలియజేసే సామర్థ్యాలను కలిగి ఉందని మరోసారి నిరూపించింది. తీవ్రమైన గుండె పరిస్థితిని గుర్తించడంలో సహాయపడింది. కెనడాకు చెందిన 44 సంవత్సరాల వయసు గల ట్రావిస్ చామర్స్ అనే అగ్నిమాపక సిబ్బంది తన కుమారుడితో కలిసి రోడ్ హాకీ ఆడుతున్నాడు. అతని ఛాతీలో అకస్మాత్తుగా నొప్పి మొదలైంది. తీవ్రమైన తలనొప్పి కూడా వచ్చింది. మొదట్లో ఈ లక్షణాలు ఫ్లూ లేదా అలెర్జీల కారణంగా ఉన్నాయని భావించాడు. చామర్స్ వెంటనే తన హృదయ స్పందన రేటు అసాధారణంగా పెరిగినట్లు తెలుసుకున్నాడు. 

Read More వేసవిలో పుచ్చకాయ ఎక్కువగా తినడం మంచిదా? ఎంత తినాలి?

అతని యాపిల్ వాచ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్‌ తో వెంటనే వైద్యులను సంప్రదించాడు. చామర్స్ యాపిల్ వాచ్ గుండెలో పరిస్థితి సక్రమంగా లేదని, వేగవంతమైన హృదయ స్పందన రేటు ఉందని నోటిఫికేషన్ పంపింది. ఇది స్ట్రోక్, గుండె ఆగిపోయే ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపింది. దీంతో వైద్యులను సంప్రదించగా.. గుండెలో సమస్య ఉందని గుర్తించి చికిత్స అందించారు. యాపిల్ స్మార్ట్ వాచ్ తన ప్రాణాన్ని కాపాడిందని చికిత్స తర్వాత అతడు స్థానిక మీడియాతో చెప్పాడు.

Read More కాటన్ బడ్స్ వాడుతున్నారా? ఇదే నువ్వు చేస్తున్న తప్పు!