అస్తవ్యస్తంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ

రోడ్లపై ప్రమాదకరంగా మ్యాన్ హొల్స్..
గుంతలమయంగా రోడ్లు..
నాసిరకం పనులతో ప్రజాధనం వృధా..
అక్రమ వెంచర్లో అభివృద్ధి పనులు

అస్తవ్యస్తంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ

జయభేరి, మేడ్చల్ : మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిదిలోని మైసమ్మగూడాలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. గుంతలుగా మరీనా రోడ్డు, రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా పగిలిన డ్రైనేజీ మ్యాన్ హోల్ వల్ల ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ఈ రోడ్డులో ప్రయాణిస్తే ఎప్పుడు మ్యాన్ హిల్స్ లో పడి ప్రమాదం జరుగుతుందో అని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.

మైసమ్మగూడాలో మల్లారెడ్డి యూనివర్సిటీ ఉండటంతో ఈ రోడ్డు వెంట నిత్యం వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు ప్రయాణం చేస్తుంటారు.  గతంలో ఈ రోడ్డు మధ్యలో డ్రైనేజీ పైప్ లైన్ కోసం రోడ్డును తవ్వి మరమ్మతులు చేశారు. తవ్విన రోడ్డులో మట్టితో చదును చేసి వదిలేయడంతో ప్రస్తుతం రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. అధ్వానంగా మారిన రోడ్డు మరమ్మతుల కోసం సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.

Read More అలియాబాద్ లో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

IMG-20240820-WA1545

Read More పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట

నాసిరకంగా డ్రైనేజీ పనులు మైసమ్మగూడాలో బహుళ అంతస్తుల భావనలు ఉండటంతో డ్రైనేజీ సమస్య తలెత్తకుండా మున్సిపల్ అధికారులు రోడ్డు మధ్యలో డ్రైనేజి కాలువ తవ్వి పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా కాంట్రక్టర్ కక్కుర్తో లేక అధికారుల నిర్లక్ష్యం వల్లో నాసిరకంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమిషన్లకు కక్కుర్తి పడి నాసిరకంగా పనులు చేయడంతో రోడ్డు మధ్యలో నిర్మించిన మ్యాన్ హొల్స్ తరుచూ పగిలిపోతున్నాయి. దింతో రోడ్డులో ప్రయాణించే వాహనదారుల ప్రమాదాలకు గురైతున్నారు. ఈ రోడ్డు వెంట వేలాది వాహనాలు ప్రయాణాలు చేస్తుంటాయి. ఇప్పటికైనా అధికారులు మ్యాన్ హొల్స్ ఏర్పాటు కోసం పకడ్బందీగా మరమ్మత్తు పనులు చేసి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

Read More బీరప్పకు బోనమెత్తిన మూత్తిరెడ్డి గూడెం కురుమ, గొల్లలు....

IMG-20240820-WA1551

Read More ఈ సారి ఫాంహౌస్ లు టార్గెట్...

అక్రమ వెంచర్లో అభివృద్ధి పనులు వడ్డించేవాడు మనవాడైతే..బంతిలో ఎక్కడ కూర్చున్నా అన్ని లభిస్తాయి అన్నట్లు ఉంది గుండ్లపోచంపల్లి మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరు.

Read More అమ్మో... ఎంత హడావిడి చేసిందో...

మైసమ్మగూడా ప్రధాన రహదారిపై గుంతలు ఒకవైపు పగిలిన డ్రైనేజీ మ్యాన్ హొల్స్ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టించుకుని అధికారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెలసిన అక్రమ వెంచర్లో సరైన అనుమతులు లేని భవనాలకు డ్రైనేజీ పనులు చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొందరి ప్రజాప్రతినిధులు, మాజీ రిటైడ్ అధికారి స్వప్రయోజనాల కోసం ఈ అభివృద్ధి పనులు చేస్తున్నారని ఆటోపణలు వినిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిదిలోని మైసమ్మగూడా సర్వే నెంబర్ 621లో ఉన్న ఎటువంటి అనుమతులు లేకుండ నిర్మించిన వెంచర్ లో మున్సిపల్ పాలకవర్గం తీర్మాణంతో అభివృద్ధి పనులు చేపట్టారు.

Read More వేంకటేశ్వర స్వామి అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వెంచర్ ను అడ్డుకోవాల్సిన అధికారులు అక్రమాలకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైనా వెంచర్ ఏర్పాటు చేయాలంటే హెచ్‌ఎండిఏ నిబంధనల ప్రకారం ప్రభుత్వ అనుమతి పొంది ఉండాలి. అంతేకాకుండా వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తికి కనీస అవసరాలైన రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ పార్కు తదితర అవసరాలు కల్పించాలి.

Read More ఘనంగా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సముద్రాల నరహరి ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం 

కానీ మైసమ్మగూడలో ఇలాంటి నిబంధనలు మాకు చెల్లవంటూ వ్యవసాయ భూములను తమకు ఇష్టం వచ్చినట్లు ప్లాట్లుగా మలిచి ప్రజలకు విక్రయిస్తున్నారు. రియల్‌ వ్యాపారులు ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మారుస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా వివిధ సౌకర్యాలు కల్పించకుండా ప్లాట్లు కొనుగోలు చేసే ప్రజలను సైతం మోసాగిస్తున్నారు. సర్వే నెంబర్ 621 పరిధిలో వెలసిన అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసి నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అక్రమ నిర్మాణాలను ఎలా అభివృద్ధి పనులకు తీర్మానం చేస్తారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Read More ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యం

Latest News

గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్ గల్ఫ్ మరణ బాధితుల వారసులకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ముఖ్య మంత్రి రేవంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ మహ్మద్ ఐజాజ్ ఉజ్ జమాన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు...
పోటాపోటీగా జరిగిన లడ్డూ వేలం పాట
తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి
లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
పెట్టుబడులకు, నూతన ఆవిష్కరణలకు అనుకూల ప్రాంతం - తెలంగాణ
అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన