బీరప్పకు బోనమెత్తిన మూత్తిరెడ్డి గూడెం కురుమ, గొల్లలు....

బీరప్పకు బోనమెత్తిన మూత్తిరెడ్డి గూడెం కురుమ, గొల్లలు....

యాదాద్రి భువనగిరి : మోటకొండూరు మండలం, మూత్తిరెడ్డి గూడెంలో శ్రీ శ్రీ శ్రీ బీరప్ప స్వామికి బోనాలు కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి.

IMG-20240825-WA2277

Read More వంద పడకల ఆసుపత్రి ప్రారంభానికి మోక్షం ఎప్పుడో ?

తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు బోనమెత్తి ఊరేగింపు నిర్వహిస్తారు.
బోనాల ఊరేగింపులో డప్పు చప్పుళ్లు,డోలు వాయిద్యాల నడుమ శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, యువకుల కేరింతలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
కురమ, గొల్ల కులస్థల ఆరాధ్యదైవమెన బీరప్ప కామరాతి, అక్క మహంకాళి దేవులకు స్వామికి భక్తి శ్రద్ధలతో నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బీరప్ప స్వామి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Read More రైతుబంధును బంజేసే కుట్ర: హరీశ్ రావు..!!

IMG-20240825-WA2279

Read More మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సాయి గౌడ్

ఈ కార్యక్రమంలో పెద్ద కురుమ బచ్చ విఠల్ కురుమ, బచ్చ బిక్షపతి కురుమ, కురుమ సంఘం అధ్యక్షుడు కాటిక స్వామి యాదవ్,ప్రధాన కార్యదర్శి కాటిక రవి యాదవ్, ఉపాధ్యక్షుడు బచ్చ రాములు కురుమ, కురుమ సంఘం నాయకులు కంచర్ల రాములు కురుమ, కంచర్ల బిరప్ప కురుమ, కురుమ సంఘం యువత కంచర్ల ప్రశాంత్ కురుమ, కాటిక రవి యాదవ్, కాటిక క్రాంతి యాదవ్, బచ్చ లింగుస్వామి కురుమ, బచ్చ శ్రీశైలం కురుమ, బచ్చ క్రిష్ణ కురుమ, కంచర్ల మదు కురుమ, బచ్చ ఉపేందర్ కురుమ, బచ్చ శ్రీశైలం కురుమ, కాటిక అరవింద్ కురుమ,కంచర్ల భాను, కంచర్ల భరత్ కురుమ, కంచర్ల తరుణ్ కురుమ, కాటిక శివ యాదవ్, కాటిక అనిల్ యాదవ్, కురుమ, గొల్ల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి