వేంకటేశ్వర స్వామి అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు

పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తి జనం

వేంకటేశ్వర స్వామి అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు

జయభేరి, ఆగస్టు 26:- మేడ్చల్ జిల్లా మౌలాలి ఆర్టీసీ కాలని లోని తిరుమల్ నగర్ లో గల శ్రీ అన్నమాచార్య సహిత, శ్రీ భూదేవి గోదాదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి.

ఈ నెల 21న అంకురార్పణ కార్యక్రమంతో మొదలైన ఈ బ్రహ్మోత్సవాలు సోమవారం ధ్వజారోహణంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 24న  స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. 25 న సుదర్శన హోమం, 26న చివరి రోజు మహా పూర్ణాహుతి, చక్రస్నానం, సాయంత్రం శ్రీ పుష్పయాగం, దేవతాఉద్వాసనతో  కార్యక్రమాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పిల్లి రామేశ్వర్ రావ్, ఛైర్మన్ కోలా ఆంజనేయులు, సభ్యులు పిల్లి హన్మంతరావు, శ్రీ ప్రసాద్, డొక్కా గాయత్రి, సుధాకర్, శ్రీనివాస్, నరసింహం, ఆలయ అర్చకులు మురళీధర్ చార్యులు, యజ్ఞచార్యులు, శ్రీమాన్ మంగళగిరి యాదగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు.

Read More పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం

IMG-20240826-WA2996

Read More శాయంపేట బిజేపి మండల అధ్యక్షునిగా నరహరిశెట్టి రామకృష్ణ